ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయినా సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది నయనతార. ఇటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతోపాటు అటు కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ వస్తోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఈ భామ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోందని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తూన్నా వాళ్లిద్దరూ మాత్రం ఈ విషయం గురించి పెదవి విప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు.
ఎట్టకేలకు నయన్ విషయంలో విషయంలో విఘ్నేష్ ఓపెన్ అయినట్టే కనిపిస్తున్నాడు. ఉమెన్స్ డే సందర్భంగా విఘ్నేష్ ఓ పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది బాగానే వైరల్ అయింది. ‘‘మన జీవితాన్ని సంపూర్ణం చేసినవారికి.. ప్రేమంటే ఏమిటో చూపినవారికి.. మన బతుకుల అర్ధం చెప్పిన వారికి.. ఎలాంటి షరతుల్లేకుండా మనల్ని ప్రేమించి ఈ ప్రపంచాన్ని అందంగా మార్చిన అమ్మలు... సోదరీమణులు.. ప్రియమైన వాళ్లకు హ్యాపీ ఉమెన్స్ డే’’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పోస్టుతోపాటు రెండు ఫొటోలు కూడా విఘ్నేష్ పెట్టాడు. అందులో ఒకటి ఒకటి తన తల్లి.. సోదరితో ఉన్న ఫొటో ఒకటయితే... ఇంకోటి నయన్ తో సన్నిహితంగా ఉన్నదొకటి. తాను నయనతారను ప్రేమిస్తున్న విషయం చెప్పకనే చెప్పాడా... తన మనసులోని దాగి ఉన్న నిజం బయటపెట్టాడా? ఇంకెందుకు విఘ్నేష్ ఆ మాటేదో ఓపెన్ గా చెప్పేయక.