పుత్రోత్సాహము పుత్రుని కనంగ రాదు, ఆ సుపుత్రుడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైతేనే ఏ తండ్రికైనా ఆనందం. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ ఆ ఆనందంలోనే ఉన్నాడు. తన సుపుత్రుడు సంజయ్ ఆలోచనల్లో ఎదుగుదలను చూసి తెగ మురిసిపోతున్నాడు. అంతేనా అతడు ఏ సినిమాకి సంతకం చేయాలన్నా ముందుగా తనయుడి అభిప్రాయం తెలుసుకుంటున్నాడు. కొడుకు ఉయ్ అంటేనే ఆ చిత్రంలో నటించేందుకు సై అంటున్నాడు విజయ్.
ఇలయదళపతిగా తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ కథల ఎంపిక విషయంలో తనయుని ఆశ్రయించడం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది. అంతెందుకు చింబుదేవన్ చెప్పిన 'పులి' కథను తొలిగా విజయ్ కొడుకు విన్నాడు. అటుపై తనకి నచ్చాకే తండ్రితో ఓకే చెప్పమని అన్నాడు. పులి తెరకెక్కితే తండ్రిని ఎలా చూడొచ్చో ముందుగానే ఆ కొడుకు ఊహించుకున్నాడు. వీరాధివీరుడిగా కత్తి పట్టి శత్రువుపైకి లంఘించే తండ్రిని ఊహించుకున్నాడు. బట్టి విక్రమార్కుని కథల్లో విక్రమార్కుడిలా కనిపించాడట. అలా చింబుదేవన్ చెప్పిన కథ ఓకే అయ్యింది.
ఇటీవలే పులి టీజర్ రిలీజై సంచలనాలు సృష్టించింది. ప్రస్తుతం మూడు దేశాల్లో నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఆగస్టు చివరినాటికి తొలికాపీ సహా సినిమా రిలీజ్‌కి రెడీ అయిపోతుంది. మన సాంబార్ ఆడియన్స్ ఏకంగా బాహుబలికి పోటీగా రాగలిగే సినిమా ఇది అని ఊహించుకుంటున్నారు. అది సంగతి.