ఎవ‌రు బెస్ట్ డ్యాన్స‌ర్ అంటూ ఫ్యాన్ వార్

Update: 2019-12-02 01:30 GMT
సౌతిండియాలో తెలుగు - త‌మిళ స్టార్ల రేంజ్ గురించి తెలిసిందే.  బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా నేనా అంటూ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టే స‌త్తా ప‌లువురు స్టార్ హీరోల‌కు ఉంది. ఇక న‌ట‌నలో.. డ్యాన్సుల్లోనూ అద్భుత‌మైన ట్యాలెంట్ ఉన్న హీరోలు సౌత్ లో ఉన్నారు. టాలీవుడ్ వ‌ర‌కూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. యంగ్ య‌మ ఎన్టీఆర్ .. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డ్యాన్సింగ్ స్టైల్ కి.. ఆ ఎన‌ర్జీకి ప్ర‌త్యేకించి ఫ్యాన్స్ ఉన్నారు.

అటు త‌మిళంలో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌కు అంతే ఫాలోయింగ్ ఉంది. త‌మిళ ప‌వ‌ర్ స్టార్ గా పాపుల‌రైన విజ‌య్ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో త‌న రేంజు స్కైలో ఉంద‌ని నిరూపిస్తున్నాడు. ఇటీవ‌లే బిగిల్ చిత్రంతో త‌మిళంలో పెద్ద విజ‌యం అందుకున్నాడు. ఇదే చిత్రం తెలుగులో విజిల్ పేరుతో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఓవ‌రాల్ గా వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్రం విజ‌యం అందుకుంది.

ఈ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్వ‌యంగా విజ‌య్ కి ఫోన్ చేసి అభినందించార‌ట‌. ఒక బెస్ట్ డ్యాన్స‌ర్ కం న‌టుడికి తార‌క్ నుంచి అభినంద‌న అంటే ఆస‌క్తిక‌ర‌మే. ఈ విష‌యం తెలిసిన తార‌క్ ఫ్యాన్స్ లో ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. తార‌క్ - విజ‌య్ ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ డ్యాన్స‌ర్? అన్న చ‌ర్చ సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కిస్తోంది. అభిమానుల‌కు ఆల్వేస్ తార‌క్ ది బెస్ట్ అన‌డంలో సందేహం లేదు. అయితే విజ‌య్ కి త‌మిళంలో అంతే గొప్ప పాలోయింగ్ ఉంది. అత‌డి డ్యాన్సులు మాస్ స్టెప్పులు అంటే చెవి కోసుకునే ఫ్యాన్స్ ఉన్నారు. విజ‌య్ మాస్ సాంగ్స్ ని త‌మిళ‌నాడులో ప‌లు ఈవెంట్ల‌లో యూత్ అదే ప‌నిగా దుమ్ము రేపుతుండ‌డం క‌నిపిస్తుంది. ఇక త‌మిళ టీవీ చానెళ్ల‌లో డ్యాన్స్ రియాలిటీ షోల్లో విజ‌య్ పాట‌ల‌కు ఉండే గిరాకీనే వేరు. తార‌క్ ఆర్.ఆర్.ఆర్ తో బిజీగా ఉండ‌గా.. అటు విజ‌య్ ద‌ళ‌ప‌తి 64 (లోకేష్ క‌న‌గ‌రాజ్) చిత్రంతో బిజీగా ఉన్నారు.


Tags:    

Similar News