పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డాక ఇండియాలోని అన్ని భాషల సినిమాల మీదా ప్రభావం పడింది. సినీ వినోదానికి పెద్ద పీట వేసే తెలుగు రాష్ట్రాల్లోనూ వారం పది రోజుల పాటు కలెక్షన్లపై ప్రభావం పడింది. నిఖిల్ సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ బాక్సాఫీస్ కు కొంచెం ఊపు తీసుకొచ్చినా.. పరిస్థితి పూర్తిగా అయితే మారలేదు. మామూలుగా కొత్త సినిమాలకు ఉండాల్సిన ఆక్యుపెన్సీ ప్రస్తుతం కనిపించట్లేదు. అందుకే నిర్మాత అల్లు అరవింద్ సైతం డిసెంబరు 2న రావాల్సిన ‘ధృవ’ను 9కి వాయిదా వేశారు. డిసెంబరు 2 ఖాళీగా ఉన్నా సరే.. తెలుగులో ఇంకో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రావట్లేదు. ముందు అల్లరి నరేష్ సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ను ఈ తేదీలోనే రిలీజ్ చేద్దామని చూశారు కానీ.. తర్వాత మనసు మార్చుకున్నారు. దీంతో వచ్చే వీకెండ్లో డబ్బింగ్ సినిమాల సందడే ఉండబోతోంది.
నవంబరు 18 నుంచి వాయిదా పడ్డ ‘బేతాళుడు’ డిసెంబరు 1న వచ్చేస్తోంది. విజయ్ ఆంటోనీకి తన సినిమాల్ని గురువారం రిలీజ్ చేయడం సెంటిమెంటు. ‘బేతాళుడు’కు కూడా అదే సెంటిమెంటు ఫాలో అయిపోతున్నాడు. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ సినిమాల మీద చాలా ఆసక్తి ఉంది తెలుగు ప్రేక్షకుల్లోనూ. దీనికి తోడు ‘బేతాళుడు’ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. ఇటీవలే రిలీజ్ చేసిన తొలి పది నిమిషాల ఫుటేజ్ కూడా ఆసక్తి రేకెత్తించింది. థియేటర్లు బాగానే అందుబాటులో ఉండటంతో ‘బేతాళుడు’ను తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు మరో డబ్బింగ్ మూవీ ‘మన్యం పులి’ కూడా వస్తున్నా.. సాయిరాం శంకర్ సినిమా ‘అరకు రోడ్లో’ కూడా విడుదలవుతున్నా ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ‘బేతాళుడు’నే అనడంలో సందేహం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ‘బిచ్చగాడు’ తరహాలో కాకపోయినా.. ‘బేతాళుడు’ కూడా భారీగానే కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశముంది.