విషమంగా విజయ్ ఆంటోని ఆరోగ్యం.. ఫేస్ సర్జరీ తప్పదట!

Update: 2023-01-19 13:21 GMT
తమిళ సినీ పరిశ్రమంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆంటోని... తర్వాతి కాలంలో నటుడిగా మారారు. నాన్‌ అనే సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ సినిమాతో ఒక సైలెంట్ హిట్‌ అందుకున్నారు. తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన సలీం అనే సినిమాతో కూడా మరో హిట్ అందుకున్న ఆయన... బిచ్చగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత దాదాపుగా చేస్తున్న సినిమాలు అన్ని తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతానికి ఆయన బిచ్చగాడు 2 సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆ సినిమాలో ఒకపక్క హీరోగా నటిస్తూనే... మరొక్క దర్శకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే సినిమాకి మ్యూజిక్ కూడా అందిస్తున్న ఆయన... ప్రస్తుతం మలేషియాలో షూటింగ్ చేసేందుకు వెళ్లారు. అక్కడ షూటింగ్ చేస్తున్న సమయంలో ... ఆయన నడుపుతున్న పడవ అదుపుతప్పి కెమెరా సహా ఇతర యూనిట్ సభ్యులు ఉన్న మరో పడవని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగి రెండు మూడు రోజులు గడుస్తున్నా... ఆయన ఇంకా అపస్పారక స్థితిలోనే ఉన్నారని సమాచారం. దవడ భాగాలు బాగా దెబ్బతిని ముఖమంతా గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయనను కౌలారంపూర్ హాస్పిటల్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.

చెన్నై తీసుకువచ్చి ఇక్కడ ముఖ భాగానికి సర్జరీ చేయించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన భార్య నిర్మాత ఫాతిమా ఇప్పటికే చెన్నై నుంచి కౌలాలంపూర్ వెళ్లారు. ఆయనను కౌలాలంపూర్ నుంచి చెన్నై ఈరోజు రాత్రి లోపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. చెన్నై తీసుకు వచ్చిన తర్వాత ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆయన ఇంకా అపస్మారకస్థితిలోనే ఉన్నారని సమాచారం. ఆయనను స్పృహలోకి తీసుకొచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News