గత 9 రోజులుగా కేరళను ఎడతెరపి లేని వర్షాలు - వరదలు అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వరదలు కేరళను ముంచెత్తాయి. కేరళలో వరద బీభత్సానికి 324మంది చనిపోగా, 3 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో కేరళను ఆదుకోవాలని సీఎం పినరాయి విజయన్ పిలుపునిచ్చారు. దీంతో, సినీతారలు - సెలబ్రిటీలు - వ్యాపారవేత్తలు - మీడియా సంస్థలు స్పందించి భారీగా విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా - కోలీవుడ్ - టాలీవుడ్ - మాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు భారీ విరాళాలు ప్రకటించి తమ ఉదారతను చాటుకున్నారు. తాజాగా, తమిళ స్టార్ హీరో - ఇళయ దళపతి విజయ్ కేరళ వరద బాధితుల సహాయార్థం...భారీ విరాళం ప్రకటించారు. తన వంతుగా 14 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఆర్థిక సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్లు విజయ్ ప్రకటించారు.
మరోవైపు, ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం కేరళకు 500 కోట్ల రూపాయల తక్షణ సాయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని మోదీని రాహుల్ కోరారు. తాజాగా, తమిళనాడు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలతో పాటు 2 కోట్ల విలువ చేసే 300 టన్నుల పాలపొడి, 500 టన్నుల బియ్యం - దుప్పట్లు - ఇతర సామాగ్రి సాయంగా అందజేసింది. అంతేకాకుండా, తాజాగా, హర్యానా సీఎం ఖట్టర్- 10 కోట్ల రూపాయలు.....బిహార్ సీఎం నితీష్ కుమార్- 10 కోట్ల రూపాయలు....ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్- 5 కోట్ల రూపాయలు....జార్ఖండ్ సీఎం రఘుబర్‌దాస్ - 5 కోట్ల రూపాయలు...అందజేశారు. అంతకుముందు, తెలంగాణ సీఎం కేసీఆర్ 25 కోట్లు, ఏపీ సీఎం చంద్రబాబు 10 కోట్లు ఇవ్వగాఢిల్లీ సీఎం కేజ్రీవాల్ - పంజాబ్ సీఎం అమరీందర్ రూ.10 కోట్ల చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.