సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడానికి వినూత్నంగా ముందుకొచ్చాడు. విజయ్ దేవరకొండ ఏది చేసినా విభిన్నంగా ఉండేలా చేస్తాడని మరోసారి నిరూపించుకున్నాడు. సినిమాలే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రౌడీ తనదైన శైలీలో ప్రయత్నం చేస్తున్నాడు. నలుగురిలో ఒకడిలా కాదు.. ఆ నలుగురు తిరిగే చూసే ఒక్కడిలా ఉంటాడని కరోనా క్రైసిస్ కోసం ఆయన తీసుకున్న స్టెప్ చూస్తేనే అర్థమవుతుంది. కరోనా వైరస్ సంక్షోభంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న సామాన్యులను చేయూత నివ్వాలని కంకణం కట్టుకున్నాడు. సెలబ్రెటీలు అందరూ ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటే దేవరకొండ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడంటూ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ట్రోల్స్ వచ్చాయి. అయితే వాటన్నంటికి ఒకే ఒక్క ట్వీట్ తో సమాధానం చెప్పాడీ రౌడీ దేవరకొండ. రెండు బిగ్ అనౌన్స మెంట్స్ చేశాడు. ఇందులో ఒకటి ఉద్యోగ కల్పన కాగా రెండోది నిత్యావసర సరకులను అందించడం అంటూ వీటి గురించి వీడియో ద్వారా క్షుణ్ణంగా వివరించాడు. దీని కోసం ఆయన రెండు చారిటీ సంస్థలను ఏర్పాటు చేశారు.
ఈ సంక్షోభ సమయంలో నిత్యవసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికోసం 25 లక్షల రూపాయలతో ‘మిడిల్ క్లాస్ ఫండ్' (ఎం.సి.ఎఫ్) ఏర్పాటు చేశారు. అలాగే యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి.డి.ఎఫ్)’ను ఏర్పాటు చేశారు. రూ. కోటితో మొదలైన టీడీఎఫ్ ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసిన వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారట. ఎప్పటినుండో నుంచో ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ చేస్తున్నానని.. మొదటగా కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను తమ టీమ్ ఎంచుకుందని, వారి ద్వారా కొంతమందికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని తెలిపాడు. చివరకు ఓ యాభై మందిని తమ టీమ్ సెలెక్ట్ చేసిందని, అందులో ఓ ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపాడు. ఈ లాక్ డౌన్ వల్ల మిగతా 48 మంది రిజల్ట్ ఆగిపోయిందని పేర్కొన్నాడు. తన జీవితంలో కనీసం ఒక లక్ష మందికి ఉద్యోగులను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు విజయ్ తెలిపాడు.
అలాగే లాక్ డౌన్ వేళ కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారు thedeverakondafoundation.org సైట్ లో లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారని.. దగ్గరలోని కిరాణ షాపుకు వెళ్లి సరకులను కొనుగోలు చేస్తే డబ్బులను పౌండేషన్ సభ్యులు చెల్లిస్తారని.. ఈ 25లక్షలతో 2000 కుటుంబాల అవసరాలు తీర్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. ఒకప్పుడు తనది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనని గుర్తు చేశాడు విజయ్ దేవరకొండ. అందుకే మధ్యతరగతి కష్టాలు తనకు తెలుసన్నాడు. అయితే ఇది దానం ఏమాత్రం కాదని సాయం మాత్రమేనని.. ఈ ఫౌండేషన్ ద్వారా సాయం పొందినవారు ఎప్పుడైనా తిరిగి ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని కూడా చెబుతున్నారు. అలా వచ్చిన డబ్బుల్ని వేరే మంచి కార్యక్రమాల కోసం వాడుతామని విజయ్ దేవరకొండ తెలిపాడు.
అంతేకాకుండా ఇన్ని రోజులు కరోనా సహాయంపై స్పందించకపోవడానికి కారణాలు చెప్తూ తన దగ్గర అంత మొత్తంలో డబ్బు ఆ సమయంలో లేదని.. అంతేకాకుండా నా ప్రొడక్షన్ హౌజ్ లో పనిచేసే 35 మంది ఉద్యోగుల కష్టనష్టాలు చూసుకోవలసిన భాద్యత కూడా తన మీద ఉండటంతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా తన ఫ్రెండ్ చేయూతనిచ్చారని.. సినిమా షూటింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే వారి డబ్బులు ఇచ్చేస్తానని తెలిపాడు. ఏదేమైనా కరోనా విషయంలో తనదైన స్టైల్లో సాయం అందిస్తూ... తనకుంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. ఇకపోతే దేవరకొండ ఫౌండేషన్ కి యువ హీరో కార్తికేయ లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించగా.. డైరెక్టర్ కొరటాల శివ విజయ్ దేవరకొండకు అన్ని వేళలా అండగా ఉంటానని.. ఇద్దరం కలిసి మంచితో కుమ్మేద్దాం అంటూ ట్వీట్ చేసాడు.