బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందించనున్నారు. సుకుమార్ ‘పుష్ప’ సినిమా రెండు భాగాలు పూర్తి చేసిన వెంటనే విజయ్ దేవరకొండ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.
అయితే కరోనా నేపథ్యంలో 'పుష్ప' షూటింగ్ నిలిచిపోవడంతో డైరెక్టర్ సుకుమార్.. 'పుష్ప 2' కథతో పాటుగా విజయ్ కోసం స్క్రిప్ట్ ని రెడీ చేసి పనిలో ఉన్నారట. ఇప్పటికే VD కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుక్కు.. ప్రస్తుతం ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిన తర్వాత విజయ్ కు వినిపించనున్నారు. వీడీ ఇమేజ్ కి తగ్గట్లుగా ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ని సుకుమార్ డీల్ చేయబోతున్నారు.
ఇకపోతే 'సుకుమార్-విజయ్' ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండకపోవచ్చని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. వీటిని ఖండిస్తూ ఫాల్కన్ క్రియేషన్స్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. డైరెక్టర్ సుకుమార్ - హీరో విజయ్ కమిట్మెంట్స్ పూర్తైన వెంటనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సుకుమార్-VD-ఫాల్కన్ కలయిక బిగ్గర్ గా ఉండబోతోందని.. 2022 లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని పేర్కొన్నారు.