ఖాకీ అంటే కంగారు పుట్టాల్సిందే. అది సామాన్యుడికైనా.. సెలబ్రిటీకైనా. కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టినంతనే వారి బాడీ లాంగ్వేజ్ లో ఎంత మార్పు వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నా.. స్టేషన్లోకి వచ్చినా.. పోలీసుల ఇష్యూ వచ్చినా ప్రముఖులు సైతం ఆచితూచి అన్నట్లు ఉంటారు. రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
కాస్తంత హాస్యం.. మరికాస్త వ్యంగ్యం.. ఎక్కడా.. ఏ మాత్రం మిస్ కాకుండా.. డోస్ తగ్గకుండా సోషల్ మీడియాలో వారు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పోలీస్ అంటే పక్కింటి కుర్రాడున్న రీతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ పేజీని నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా అర్జున్ రెడ్డి ఫేం.. విజయ్ దేవరకొండ పోలీసులకు అల్లుడయ్యాడు. అదెలా అంటారా? దానికో లెక్క ఉంది. ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ పేజీలో ఈ యూత్ హీరోను ఉద్దేశించి పోలీసులు పెట్టిన మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ వ్యవహారంలో.. పోలీసులు అర్జున్ రెడ్డిని అల్లుడని ఎందుకు అన్నట్లు? అన్న ప్రశ్న దగ్గర ఆగిపోయే పరిస్థితి.
బుధవారం విజయ్ దేవరకొండ బర్త్ డే అన్న విషయం తెలిసిందే. అందరి మాదిరి కాకుండా రోటీన్ కు భిన్నంగా విజయ్ తన బర్త్ డేను జరుపుకున్నారు. ది విజయ్ దేవరకొండ బర్త్ డే ట్రక్ పేరుతో మూడు వ్యాన్స్ ను సిటీ మొత్తం తిప్పారు.ఈ వ్యాన్స్ లో ఐస్ క్రీం ఉండటం.. ప్రజలకు ఫ్రీగా పంచిపెట్టటం చేశారు. సిటీలో తిరుగుతూ ఎండలో కష్టపడుతున్న ట్రాఫిక్ పోలీసులకు.. వ్యాపారులకు.. విద్యార్థులకు కూల్ ఐస్ క్రీం పెట్టి అలరించారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు.
దీనికి స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. గుడ్ ఐడియా. పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లుడుగారు అంటూ ట్వీట్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇంతకీ పోలీసులు అర్జున్ రెడ్డిని అల్లుడుగారంటూ ఎందుకు పిలిచారన్న ఇష్యూలోకి వెళితే.. అర్జున్ రెడ్డి సినిమాలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న విజయ్ ఫోటోతో.. మరణానికి ముఖ్య కారణం తలకు గాయం కావటమే అంటూ గతంలో హైదరాబాద్ పోలీసులు ట్వీట్ పెట్టారు. దీనికి అప్పట్లో స్పందించిన విజయ్.. సారీ మామా.. ఇప్పటి నుంచి పక్కా అంటూ రిప్లై పెట్టారు. బహుశా పాత బంధాన్ని గుర్తుంచుకొని.. సరదాగా ఈ వ్యాఖ్యను పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఏమైనా.. ట్రాఫిక్ పోలీసులకు అర్జున్ రెడ్డి అల్లుడైనట్లుగా అఫీషియల్ గా సర్టిఫై చేసినట్లే. ఏమంటారు?