హ్యాపెనింగ్ హీరో.. కథ రాసుకున్నాడట

Update: 2017-03-01 10:05 GMT
విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ హీరో. ‘పెళ్లిచూపులు’ తర్వాత అతడిపై అవకాశం వర్షం కురుస్తోంది. ఈ వారం విడుదలవుతున్న ‘ద్వారక’ కాకుండా అతడి చేతిలో ఏడు సినిమాలున్నాయిప్పుడు. కనీసం రెండేళ్ల పాటు అతడి డైరీ ఖాళీనే లేదసలు. హీరోగా అంత బిజీగా ఉన్న విజయ్.. ఒకప్పుడు దర్శకత్వ కలలు కన్న సంగతి చాలామందికి తెలియదు. ఐతే అనుకోకుండా నటుడిగా అవకాశాలు రావడంతో దానికే ఫిక్సయిపోయాడు. ఐతే భవిష్యత్తులో తాను దర్శకుడిగా మారాలనుకుంటున్నానని.. అందుకోసం ఇప్పటికే కథలు కూడా రాసుకున్నానని చెప్పాడు విజయ్.

‘‘ముందు నేను రైటింగ్ మీద దృష్టిపెట్టాను. అప్పటికి నేను నటుడిగా కూడా ప్రయత్నాలు చేశాను. కానీ అవకాశాలు రాలేదు. ఐతే నాకు 25 ఏళ్లు వచ్చే వరకు నటుడిగా ప్రయత్నాలు కొనసాగించాలని.. ఛాన్స్ రాకుంటే రైటింగ్.. డైరెక్షన్ మీద దృష్టిపెట్టాలని అనుకున్నాను. అదృష్టవశాత్తూ అవకాశాలు వచ్చాయి. దీంతో నటుడిగా కంటిన్యూ అయిపోయాను. ఐతే భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనుకుంటున్నా. నా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. ఒక ఫుల్ స్క్రిప్టు కూడా రెడీగా ఉంది. నేను ఎప్పుడు డైరెక్షన్ చేసినా ఆ సినిమాలో నేను హీరోగా నటించను. మానవ సంబంధాలు చుట్టూ నడిచే కథలు నాకిష్టం. నా ఐడియాలు కూడా అలాంటివే. హాస్టల్ నేపథ్యంలో నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఒకటి రాశా. అలాగే మంచి-చెడు సమయాల నేపథ్యంలో ఒక కథ అనుకున్నా’’ అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News