తమ్ముడు ఆనంద్ దేవరకొండని తనలా పెద్ద స్టార్ ని చేయడం కోసం అన్నయ్య విజయ్ దేవరకొండ ఎంతగా శ్రమిస్తున్నాడో తెలిసిందే. విజయ్ బిగ్ స్టార్ గా మారిన అనంతరం తమ్ముడిని కూడా సినిమా రంగంలోకి తీసుకొచ్చి హీరోగా చేసాడు. కానీ ఇంకా ఆనంద్ నిలదొక్కుకోలేదు. చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. తాజాగా ఆనంద్ నటించిన `పుష్పక విమానం` ఈనెల 12న రిలీజ్ అవుతోంది. ఇందులో ఆనంద్ డీసెంట్ స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా మలిచినట్లు ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆనంద్ లో ఇన్నోసెన్సీ సినిమాకు ప్లస్ అవుతుందనే భావిస్తున్నారు.
ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా ప్రమోషన్లో విజయ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. నిర్మాతగా ఉన్నప్పటికీ తమ్ముడిని స్టార్ ని చేయాలన్న తపనే విజయ్ లో ఎక్కువగా కనిపిస్తోంది. గతంలోనూ విజయ్ కొన్ని సినిమాలు నిర్మించాడు. కానీ అప్పుడు చూపించని ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెద్ద స్టార్లే రంగంలోకి దించాడు. ట్రైలర్ లాంచింగ్ కి తనతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బన్నీ రాకతో సినిమాకు బోలెడంత ప్రచారం దొరికింది. అటు బ్రదర్స్ ఇద్దరు సోషల్ మీడియాని ఓ రేంజ్ లో వినియోగిస్తున్నారు. యూ ట్యూబ్ ఇంటర్వ్యూలు అంటూ అన్నింటిని చుట్టేస్తున్నారు.
ఇక ఈనెల 7 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విశాఖపట్టణం పోర్ట్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. విజయ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాడు. ఇలాంటి బహిరంగ ఈవెంట్ కి హాజరవ్వడం విజయ్ కి ఇదే తొలిసారి. ఓ నిర్మాతగా..తమ్ముడిని స్టార్ ని చేయాలన్న సంకల్పంతో ఇంతగా చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈవెంట్ ముఖ్య అతిధిగా బన్నీని మళ్లీ రంగంలోకి దించుతారా? లేక ప్రత్యామ్నాయం ఏదైనా ప్లాన్ చేస్తారా? అన్నది చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.