'లైగర్‌' లెక్కలు.. అందరు నేర్చుకోవాల్సిన విషయం

Update: 2022-07-31 07:30 GMT
రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ.. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా లైగర్ విడుదలకు సిద్ధం అయ్యింది. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ ఈ సినిమా ను ఏ స్థాయిలో తెరకెక్కించాడో ఇటీవల విడుదల అయిన ప్రమోషనల్‌ వీడియోలు మరియు ఫోటోలను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. హీరో గా విజయ్ దేవరకొండకు ఇది ది బిగ్గెస్ట్‌ మూవీ.

ఈ సినిమా మేకింగ్ కోసం పూరి జగన్నాధ్‌ ఎప్పుడు లేని విధంగా భారీగా ఖర్చు చేశాడట. ఇప్పటి వరకు పూరి తీసిన సినిమాల్లో భారీ సెట్టింగ్స్‌ లేవు.. కాని లైగర్ లో మాత్రం పూరి మార్క్‌ కాకుండా భారీ సెంట్టింగ్స్ ఉండటంతో పాటు.. మేకింగ్‌ పరంగా కూడా చాలా రిచ్‌ గా ఉంటుందట. ఈ సినిమా కోసం వంద కోట్ల బడ్జెట్‌ అనుకుంటే కరోనా తో సినిమా షూటింగ్‌ ఆలస్యం అయ్యి మరింత పెరిగిందట.

సినిమా నిర్మాణంలో బాలీవుడ్‌ నిర్మాణ కరణ్‌ జోహార్‌ భాగస్వామి అవ్వడంతో ఉత్తరాది బిజినెస్ బాగుందని తెలుస్తోంది. సినిమాకు వచ్చిన పాజిటివ్‌ బజ్ కారణంగా దాదాపుగా వంద కోట్ల థియేట్రికల్‌ రైట్స్ ను ఈ సినిమా దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీగానే బిజినెస్ చేసింది.

లైగర్‌ సినిమాకు గాను విజయ్‌ దేవరకొండ మరియు పూరిలు పారితోషికం గా లాభాల్లో వాటా ను తీసుకోబోతున్నారు. ప్రీ రిలీజ్‌ బిజినెస్ తో ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వచ్చిందని.. ఇక నుండి రాబోతున్న మొత్తంలో పూరి మరియు విజయ్ దేవరకొండ లు షేర్ తీసుకోబోతున్నారు. అలాగే ఉత్తరాదిన విడుదల చేయబోతున్న కరణ్‌ జోహార్ అక్కడ షేర్ ను తీసుకుంటాడట.

మొత్తానికి సినిమా మేకింగ్‌ కోసం భారీ మొత్తంను ఖర్చు చేసినా కూడా థియేట్రికల్‌ రైట్స్ ద్వారానే ఆ మొత్తంను దక్కించుకుని సినిమా ఫలితం ను బట్టి దర్శకుడు మరియు హీరో లాభాల్లో వాటా తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇప్పటికే కొంత మొత్తం పారితోషికం గా తీసుకున్న వారు ఇద్దరు లాభాల్లో వాటా ను పారితోషికంగా తీసుకోవడం వల్ల బడ్జెట్‌ చాలా తగ్గింది అనేది కొందరు అభిప్రాయం.

లైగర్‌ ప్రీ రిలీజ్ లెక్కలు మరియు హీరో దర్శకుడి పారితోషికం విషయాలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పద్ధతినే చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు అమలు అయితే బాగుంటుంది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. నిర్మాతలు ఇబ్బంది పడకుండా.. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా అంతా నిర్మాతపై ఒత్తిడి ఉండదు.
Tags:    

Similar News