ఫారిన్ ల‌వ‌ర్ గురించి లీకిచ్చాడు!

Update: 2018-10-04 14:30 GMT
ముక్కుసూటిగా ఉన్న‌ది ఉన్న‌ట్టే మాట్లాడే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అత‌డు న‌టించిన నోటా రిలీజ్‌ కి రెడీ అవుతున్న వేళ ఓ చిట్‌ చాట్‌ లో త‌న ల‌వర్ గురించి మీడియా ప్ర‌శ్నించింది. మొన్న‌నే ఫోటోలు లీక‌య్యాయి క‌దా.. ఏంటి క‌థ‌? అని ప్ర‌శ్నిస్తే విజ‌య్ చాలా ఎగ్జ‌యిటింగ్‌ గా .. స‌ర‌దాగా దానిపై క్లూ ఇచ్చేశాడు.

మంచిగ అనిపిస్తోందా.. అమ్మాయి..?  నేను ఎలాగూ ప‌బ్లిక్. కానీ కంఫ‌ర్ట్ లేన‌ప్పుడు అమ్మాయిని లాగ‌డం ఎందుకు?  అందుకే త‌న‌గురించి చెప్ప‌ను అన్నాడు. ఫోటోలు రిలీజ‌య్యాయి క‌దా? అని ప్ర‌శ్నిస్తే.. రెండేళ్ల క్రితం ఫోటోలు అవి. అందులో ఉన్న‌ది నేనే. అదేమీ మార్ఫింగు అని, వేరొక‌రు అని చెప్పను. అయితే అలాంట‌ప్పుడు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు క‌దా? అని మీడియా ప్ర‌శ్నిస్తే .. దానిపైన మ‌రో నెల‌రోజులు ఏస్కుంటుంది మీడియా `ఎందుకులే` అని అన్నారు.

మీరు ల‌వ‌ర్ బోయ్ త‌ర‌హా అనుకుంటున్నాం.. అన్న ప్ర‌శ్న‌కు.. ``నాకు ల‌వ‌ర్‌ బోయ్ ఇమేజ్ ఉందా?   ఏమో ఉంద‌ని నాకు తెలీదు... అని స‌ర‌దాగా న‌వ్వేశారు. ఆ ఫోటోలు ఇప్ప‌టివి కావు.. రెండేళ్ల నాటివి గుర్తు చేశారు. ఇంత‌కీ ఆ ఫారిన్ గాళ్ ఎవ‌రో మాత్రం దేవ‌ర‌కొండ చెప్ప‌కుండా దాట వేశాడు. త‌ను ఫ్రెండు మాత్ర‌మేనా?  లేక ఇంకెవ‌రైనానా? అన్న‌ది లీక్ చేయ‌లేదు. ఇక‌పోతే దేవ‌ర‌కొండ‌కు అమ్మాయిల్లో ఎంత క్రేజు ఉందో తెలిపేలా.. త‌న‌తో ఫోటోలు దిగేందుకు ప‌లువురు ఇంట‌ర్వ్యూ అనంత‌రం పోటీప‌డ‌డం ఈ సందర్భంగా  బోయ్స్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. బాప్‌ రే .. దేవ‌ర‌కొండ‌!!

Tags:    

Similar News