విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. రౌడీ ఇప్పటికే కమిట్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే విజయ్ స్క్రిప్ట్ ని లాక్ చేసిపెట్టాడని టాక్ వినిపించింది. సినిమా లాంచ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ సెకెండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో ఆ పనులు నిలిచిపోయాయి. దేవరకొండ `లైగర్` సైతం వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో సినిమాని ప్రారంభించడం కుదర్లేదు. అయితే ఈలోపు శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన `టక్ జగదీష్` ఓటీటీలో రిలీజ్ అయి అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది.
భారీ అంచనాల నడుమ సినిమా రిలీజ్ అయినా ప్రేక్షకుల్ని ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఈ కారణంగా విజయ్ ఇక శివతో సినిమా చేయడంలేదని..ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ప్రచారం సాగింది. విజయ్ లాక్ చేసిన స్క్రిప్ట్ లో కూడా పాన్ ఇండియా స్థాయిలో లేదని దేవరకొండ రియలైజ్ అయి లైట్ తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే తాజగా అవన్నీ గాలి వార్తలని..శివ నిర్వాణతో తప్పకుండా సినిమా చేస్తున్నానని విజయ్ క్లారిటీ ఇచ్చినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడికి ఇచ్చిన మాటను తూ.చ తప్పకుండా నిలబెట్టుకుంటానని విజయ్ అంటున్నారట.
విజయ్ `లైగర్` షూటింగ్ కి అమెరికా బయలుదేరే ముందు మరోసారి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి తాను తిరిగా రాగనే సినిమా ప్రారభించమే తరువాయి అన్నట్లు చెప్పుకొచ్చారు. జనవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా ప్లానింగ్ సిద్ధమవుతోందని సమాచారం. ప్రస్తుతం విజయ్ `లైగర్` షూట్ లో భాగంగా అమెరికాలో ఉన్నాడు. మరికొన్ని రోజుల్లోనే హైదరాబాద్ కి తిరిగి రానున్నారు. అనంతరం లైగర్ డబ్బింగ్ పనుల్లో బిజీ అవుతాడు.మొత్తానికి లైగర్ తర్వాత నిర్వాణతో దేవరకొండ సినిమా ఉంటుందన్న క్లారిటీ వచ్చేసినట్టే.