‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విపరీతమైన కోపం.. యాటిట్యూడ్ ఉన్న కుర్రాడిగా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. టీజర్.. ట్రైలర్లకు విజయ్ పాత్రే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జనాల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరగడానికి అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ చూపించిన యాటిట్యూడ్ కూడా ఒక కారణమే. ఐతే ఆ యాటిట్యూడ్ ను సినిమా వరకు పరిమితం చేయకుండా విజయ్.. నిజ జీవితంలోనూ చూపిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ‘అర్జున్ రెడ్డి’లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందన్న సంగతి ముందు నుంచి తెలుస్తూనే ఉంది.
ఈ సినిమా ప్రచారంలోనూ మొహమాటాలేమీ పెట్టుకోకుండా లిప్ లాక్ సీన్లతోనే పోస్టర్లను రెడీ చేసింది చిత్ర బృందం. ఇది కొందరికి అభ్యంతరకంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ పోస్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన అనుచరుల్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో బస్సుల మీద ఉన్న ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్లను పీకించే పని పెట్టుకున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే వీహెచ్ ను ఉద్దేశించి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వీహెచ్ పోస్టర్లను పీకిస్తున్న ఫొటోను షేర్ చేసి.. ‘‘తాతయ్యా.. చిల్’’ అంటూ కామెంట్ పెట్టాడు విజయ్. ఈ కామెంట్ లోని వెటకారం జనాలకు అర్థం కానిదేమీ కాదు. విజయ్.. బయట కూడా ‘అర్జున్ రెడ్డి’నే అనుకుంటున్నాడని.. అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ అతడిపై సెటైర్లు వేస్తున్నారు జనాలు.