టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని అందరికి ఆదర్శింగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూడున్నరేళ్లు కఠోరంగా శ్రమించి చేసిన పాన్ ఇండియా మూవీ `లైగర్`. పూరి జగన్నాథ్ తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్వల్ గా తెరకెక్కించిన ఈ మూవీపై విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయితే అతని ఆశల్ని `లైగర్` ఆవిరి చేసి బాక్సాఫీస్ వద్ద దారుణ వైఫల్యాన్ని చవిచూసి షాకిచ్చింది.
ఈ మూవీ ఇచ్చిన షాక్ లో వున్న విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే `లైగర్` ఇచ్చిన షాక్ నుంచి తేరు కుంటురన్నారు. ఈ మూవీ తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న `ఖుషీ` మూవీలో నటిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కశ్మీర్ తో పాటు హైదరాబాద్ లోనూ కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ సమంత కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సామ్ గ్రీన్ సిగ్నల్ కోసం టీమ్ అంతా ఎదురు చూస్తోంది.
ఇదిలా వుంటే `లైగర్` ఫలితం తరువాత ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా పీస్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఈ హాస్పిటల్ తో తనకున్న అనుబంధాన్ని, తన కష్ట కాలం గురించి వివరించాడు. `ఎవడే సుబ్రమణ్యం` సమయంలో తన తండ్రి అనారోగ్యం పాలయ్యారని, ఆ సమయంలో ఈ హాస్పిటల్ డాక్టర్లే వైద్యం అందించారని.. ఇప్పుడు నాన్న చాలా ఆరోగ్యంగా వున్నారని చెప్పుకొచ్చాడు.
ఆ కారణంగానే ఈ హాస్పిటల్ వారు ఆహ్వానించగానే వచ్చానని, ఆర్గాన్ డొనేషన్ గురించి తెలుసుకున్నానని, అవయవ దానం వల్ల ఎంత మంది జీవితాలు కొత్త వెలుగుల్ని చూస్తున్నాయని, అందుకే తాను కూడా ఆర్గాన్ డొనేట్ చేశానని తెలిపి అక్కడున్న వారిని సర్ ప్రైజ్ చేశాడు. చనిపోయిన తరువాత చాలా మంది తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం అద్భుతం. నా మరణానంతరం నా అవయవాలన్నీ దానం చేయడానికి ముందుకొచ్చాను.
అలా చేయడం వల్ల ఇతరుల ఆనందంలో భాగం కావడం, వారితో మళ్లీ ఈ లోకంలో వుండటం చాలా ఆనందాన్నిస్తుంది. దక్షిణాసియాలో ఎక్కువగా అవయవదానం కోసం ముందుకు రావడం లేదు. ప్రతీ ఒక్కరూ అవయవదానం కోసం ముందుకొచ్చి ప్రతిష్ఞ చేయాలని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కోరడం విశేషం. విజయ్ దేవరకొండ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమాలతో పాటు నెటిజన్ లు కూడా విజయ్ దేవరకొండ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.