కొవిడ్ కల్లోలం దేశాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎంతో మంది జాగ్రత్తలు సూచిస్తున్నారు. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండ కూడా పలు సూచనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ఏమం చెప్పాడంటే...
‘‘కొవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతోంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. ఇక, బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కానీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు’’ అని చెప్పారు.
‘‘మనకు కొవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. మీకు దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయంటే కరోనా అయి ఉంటుంది. వెంటనే.. డాక్టరు వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోండి. ఏ లక్షణాలు కనిపించినా కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకోవాలి.’’ అని సూచించారు.
‘‘కొవిడ్ బారిన పడిన వారికి టైం అన్నింటికన్నా ప్రధానమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఆరోగ్య కేంద్రంలో, ఆసుపత్రుల్లో కొవిడ్ డాక్టర్లను అందుబాటులో పెట్టింది. మీరు వాళ్లతో మాట్లాడొచ్చు. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లినా.. మందులు కిట్ రూపంలో ఇస్తారు. వాటిని వాడితే సరిపోతుంది. భయపడకండి. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ చెప్పుకొచ్చారు విజయ్.