రౌడీ స్టార్‌ 'లైగర్‌' తో పాటు మరో మూడు కూడా!

Update: 2021-06-19 05:30 GMT
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో లైగర్ సినిమా లో నటిస్తున్నాడు. గత ఏడాది కాలంగా లైగర్‌ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే ఏడాది వరకు లైగర్‌ సినిమా వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. పరిస్థితులు కాస్త కుదుట పడితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు పూరి వెయిట్‌ చేస్తున్నాడు. ఈ గ్యాప్‌ లో విజయ్‌ దేవరకొండ వరుసగా సినిమా లకు కమిట్‌ అవుతూనే ఉన్నాడు. లైగర్‌ సినిమా ప్రారంభం అయిన సమయంలోనే విజయ్‌ దేవరకొండ.. శివ నిర్వానల కాంబోలో సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.

అన్ని సవ్యంగా జరిగి ఉంటే టక్‌ జగదీష్ తర్వాత వెంటనే విజయ్ దేవరకొండతో శివ నిర్వాన సినిమా మొదలు పెట్టేవాడు. కాని షూటింగ్ లు అర్థాంతరంగా నిలిచి పోవడంతో ఇప్పటి వరకు శివ నిర్వాన మరియు విజయ్ దేవరకొండల మూవీ పట్టాలెక్కలేదు. కాస్త ఆలస్యంగా అయినా వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక విజయ్ దేవరకొండ మరియు సుకుమార్‌ల మూవీ కూడా అధికారిక ప్రకటన వచ్చింది. పుష్ప పార్ట్‌ 1 తర్వాత విజయ్ దేవరకొండతో సుకుమార్ మూవీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

లైగర్‌.. శివ నిర్వాన మూవీ ఇంకా సుకుమార్ ల మూవీ తో పాటు మరో సినిమా కు కూడా విజయ్‌ దేవరకొండ ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. జెర్సీ సినిమా తో జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ తెరకెక్కబోతుందట. ఇటీవలే గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు విజయ్ ఓకే చెప్పాడని.. మొదటి మూడు సినిమాలు పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఏడాదిలో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
Tags:    

Similar News