2 మిలియన్ల నుంచి 30 వేలకు వేలకు పడిపోయాడు

Update: 2018-03-11 05:15 GMT
‘పెళ్ళి చూపులు’ సమయానికి విజయ్ దేవరకొండకు పెద్దగా పేరు లేదు. ఐతే ఆ చిత్రం మౌత్ టాక్ తో జనాల్లోకి వెళ్లింది. అమెరికాలో 1.3 మిలియన్ డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది. దీని తర్వాత విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రం యుఎస్ లో 2 మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకుంది. ఇలాంటి సినిమా తర్వాత విజయ్ నుంచి ఎలాంటి చిత్రం వచ్చినా ఏదో ఒక మోస్తరుగా ఆడాలి. కానీ అతడి కొత్త సినిమా ‘ఏ మంత్రం వేసావె’ ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు యుఎస్ లో దారుణమైన ఫలితాన్నందుకుంది. సినిమాలు లేక థియేటర్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేశారు.

కానీ వసూళ్లు మాత్రం మరీ నామమాత్రంగా ఉన్నాయి. ‘ఏ మంత్రం వేసావె’ ప్రిమియర్లకు కనీస స్పందన లేకపోయింది. గురువారం ప్రిమియర్లు.. శుక్రవారం రెగ్యులర్ షోలు కలిపి 27 వేల డాలర్లు మాత్రమే వసూలయ్యాయి. శనివారం 10 వేల డాలర్లు కూడా వచ్చేలా లేవు. మొత్తంగా ఈ చిత్ర వసూళ్లు 40 వేల డాలర్ల మార్కును కూడా అందుకునేలా లేవు. కొన్నేళ్ల పాటు మరుగున పడి ఉండగా.. ఈ మధ్యే దీన్ని బయటికి తీసి రిలీజ్ చేశారు. ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నప్పటికీ విజయ్ ముఖం చూసి సినిమాను కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయినట్లే. ఈ సంగతి తెలిసేనేమో విజయ్ ఈ సినిమా ప్రమోషన్ల గురించి అసలేమాత్రం పట్టించుకోకుండా.. ఈ సినిమా తనది కాదన్నట్లుగా సైలెంటుగా ఉండిపోయాడు.

Tags:    

Similar News