ఒక సినిమాకు సంబంధించి తెరవెనుక దర్శకుడే కీలకం కానీ.. తెరముందు మాత్రం హీరోనే అన్నీ. అందులోనూ తెలుగులో హీరోలకుండే ప్రాధాన్యం ఎలాంటిదో ప్రత్యేకతంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే హీరోనే ముందుండాలి. అతనే జనాల్లోకి తీసుకెళ్లాలి. కానీ యువ ‘పెళ్లిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో బంపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మాత్రం తన కొత్త సినిమా ‘ఏ మంత్రం వేసావె’ను ప్రమోట్ చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. విజయ్ ఎప్పుడో మూడేళ్ల కిందట ఒప్పుకుని రెండేళ్ల ముందు పూర్తి చేసిన సినిమా అది. ఇప్పుడా సినిమా రిలీజైతే తన ఇమేజ్ ను దెబ్బ తీస్తుందనో ఏమో.. దాని జోలికే వెళ్లట్లేదు విజయ్.
ఐతే ఈ చిత్ర దర్శక నిర్మాత శశిధర్ మర్రి మాత్రం తన పాటికి తాను మార్చి 9న సినిమాను రిలీజ్ చేసేస్తున్నాడు. వారం రోజులుగా మూతబడి ఉన్న థియేటర్లు తెరుచుకున్న తర్వాత రాబోయే తొలి సినిమా ఇదే. ముందు వారాల్లో రిలీజైన సినిమాల బాక్సాఫీస్ రన్ దాదాపుగా ముగిసింది. ఇలాంటి టైంలో రావడం ‘ఏ మంత్రం వేసావె’కు అడ్వాంటేజీనే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 600 థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇలాంటి సినిమాకు ఇది పెద్ద రిలీజే. మరి ఈ అడ్వాంటేజీని సినిమా ఏమేరకు ఉపయోగించుకుంటుందో.. ప్రోమోలతో పెద్దగా ఆకర్షించని ఈ చిత్రంపై ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారో.. సినిమా సంగతెలా ఉన్నా విజయ్ కోసం థియేటర్లకు జనాలు వస్తారేమో చూడాలి.