రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ ఒకవైపు లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటూనే మరొకవైపు ఖుషి సినిమా షూటింగ్ కూడా ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయితే పూర్తయింది. ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా ఖుషి సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. క్యూట్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో కొనసాగుతోంది.
మొన్నటి వరకు వివిధ ప్రదేశాల్లో షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోనే ఏడూ ఎకరాల్లో ప్రత్యేకమైన ఒక సెట్లో సినిమా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ షూటింగ్లో విజయ్ దేవరకొండ ఒక పార్టీకి సంబంధించిన సన్నివేశాలలో నటించబోతున్నాడు. అంతే కాకుండా అందులో ఒక సాంగ్ కూడా ఉండబోతోంది. అయితే ఈ షూటింగ్లో మాత్రం సమంత పాల్గొనలేదు. విజయ్ పార్టీ సాంగ్ లో స్పెషల్ డాన్స్ తోనే ఆకట్టుకోబోతున్నాడట.
తన ఆఫీసుకు సంబంధించిన పార్టీలో చాలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుందట. ఇక ఈ షెడ్యూల్ పూర్తి చేసిన అనంతరం హైదరాబాదులోనే మరొక లొకేషన్ లో సమంతతో కొన్ని సీన్స్ షూట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాలో సరికొత్త ప్రేమ కథను ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది.
ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ అలాగే సాంగ్స్ కూడా త్వరలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.