గీత గోవిందంతో హిట్ పెయిర్ అనిపించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ దక్కించుకోలేదు కానీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ రూపంలో రిలీజయ్యాక అక్కడ స్పందన బాగానే ఉన్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పివిఆర్ - అమెజాన్ ప్రైమ్ లు కలిసి ప్రముఖ మూవీ అనలిస్ట్ అనుపమ చోప్రా ఆధ్వర్యంలో ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. దీనికి మీడియా ప్రతినిధులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కూడా విచ్చేశారు.
స్పెషల్ ఏంటంటే డియర్ కామ్రేడ్ లీడ్ పెయిర్ విజయ్ - రష్మిక ఇద్దరూ దీనికి హాజరు కావడం. ఈ ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అక్కడికి వచ్చిన వాళ్ళతో ముఖాముఖీ జరిపి సందేహాలన్నీ తీర్చారు .ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలతో జులై నెలాఖరున విడుదలైన డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు.
అయినా సినిమాలోని థీమ్ ని ప్రెజెంట్ చేసిన విధానాన్ని ఇష్టపడిన వాళ్ళు లేకపోలేదు. రీజియన్ కో టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనతోనే డియర్ కామ్రేడ్ ను నార్త్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ట్రెండీ వేర్ తో కామ్రేడ్ జంట అందరి చూపు తమ వైపే ఉండేలా చేసుకుంది. హాల్ లో మిస్ అయినవాళ్లు ఇప్పుడైనా ప్రైమ్ లో డియర్ కామ్రేడ్ ని చూసి ఫీల్ మిస్ కాకండని కోరుతోందీ జంట