విజయ్ దేవరకొండను ఆయన అభిమానులు యాటిట్యూడ్ కా బాప్ అని అంటూ ఉంటారు. ఏ విషయంలో కూడా తనను తాను ఉన్నతంగా ఊహించుకోవడం, తానే విజేత అని భావించే వారే ఎక్కువ విజయాన్ని సాధిస్తారు. విజయ్ దేవరకొండలో అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా మరోసారి ఆ విషయం నిరూపితం అయ్యింది. ప్రస్తుతం ఈయన 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుండి రెండవ పాట వచ్చేందుకు సిద్దం అవుతోంది.
మే 12వ తారీకున 'డియర్ కామ్రేడ్' సెకండ్ సాంగ్ రాబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ విషయం తెలియజేసిన సమయంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ అప్పుడే తన పాటను ప్రకటించేశాడు. ఇప్పటికే ఈ ఏడాదిలో మంచి పాటలు వచ్చాయి, ఇంకా ఈ ఏడాదిలో ఏడు నెలల సమయం ఉంది. అయినా కూడా తన పాట విడుదల కాకుండానే సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ధీమాగా చెప్పాడంటే ఆయన కాన్ఫిడెన్స్ ను అభినందించాల్సిందే.
గీత గోవిందం చిత్రంలోని దాదాపు అన్ని పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఈ పాట కూడా ఉంటుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ ఉన్నాడు. కొందరు దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, కాని ఆయన మాత్రం తన నమ్మకం అంటాడు. రౌడీ ఫ్యాన్స్ ఇప్పటికే ఆ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ప్రకటించడంతో ఆ పాట ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. మరి విజయ్ దేవరకొండ అన్నట్లుగా ఆ పాట సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తుందా చూడాలి. ఇప్పటికే డియర్ కామ్రేడ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక పాటలు సక్సెస్ అయితే సినిమాకు క్రేజ్ ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. గీత గోవిందం కాంబో అవ్వడం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ గా చెప్పుకోవచ్చు. జులైలో విడుదల కాబోతున్న ఈ చిత్రం మరోసారి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
సౌత్ లోని అన్ని భాషల్లో ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రేపు విడుదల కాబోతున్న పాట కూడా అన్ని భాషల్లో విడుదల కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.