విజయ్ దేవరకొండ పేరు చెప్తే ఇప్పుడు యూత్ కు పూనకం వస్తోంది కానీ మొదట్లో విజయ్ ఒక సాధారణమైన హీరోనే. విజయ్ డెబ్యూ ఫిలిం ఏదని అని అడిగితే ఎవరైనా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని చెప్తారు. 'నువ్విలా' మొదట సెట్స్ పైకి వెళ్ళినప్పటికీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా. కానీ కెమెరా ముందుకు వచ్చింది మాత్రం ఈ సినిమాలతో కాదు.
పుట్టపర్తి సత్య సాయిబాబా మీద వచ్చిన ఒక టీవీ సీరియల్ తో మొదటి సరిగా విజయ్ కెమెరా ముందుకు వచ్చాడు. విజయ్ పుట్టపర్తిలో చదువుకున్న విషయం తెలిసిందే. సాయిబాబా సీరియల్ కోసం కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు అవసరమైతే విజయ్ ను.. తన క్లాస్ మేట్స్ ను జూనియర్ ఆర్టిస్టులుగా ఎంచుకున్నారు. అక్కడ చదువుకునే పిల్లలే కాబట్టి వారు ఫ్రీగా నటించారు. ఆ సీరియల్లో విజయ్.. విజయ్ ఫ్రెండ్స్ కు అసలు డైలాగులు లేవట.. జస్ట్ వేరేవాళ్ళు చెప్పేది వింటూ ఉండడమేనట. కానీ లక్కీగా విజయ్ కి రెండు డైలాగులు చెప్పే అవకాశం వచ్చిందట.
సో.. అదే విజయ్ యాక్టింగ్ డెబ్యూ. అప్పుడు.. డీసెంట్ స్కూల్ బాయ్ లాగా సత్య సాయిబాబా సీరియల్లో నటించిన విజయ్ ఇప్పుడు రౌడీ హీరో గా మారి సౌత్ మొత్తం క్రేజ్ తెచ్చుకుంటాడని ఎవరూ ఊహించి ఉండకపోవచు. రౌడీ హీరో యాక్టింగ్ జర్నీ సీరియల్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలైందన్నమాట!