విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సినిమా అనగానే విభిన్న తరహా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని తన సినిమా వైపుకు తిప్పుకుంటాడు. ఆ వెరైటీ ప్రమోషన్స్ తో అభిమానుల్లో జోష్ నింపుతాడు. ఈసారి 'డియర్ కామ్రేడ్' కు మ్యూజిక్ ఫెస్టివల్స్ ప్లాన్ చేశారు.
ఇప్పటికే బెంగళూరు.. కొచ్చి.. చెన్నై నగరాలలో ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ జరిగాయి. ఈ మ్యూజిక్ ఈవెంట్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చిందని సమాచారం. ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ చూసిన వారు చెప్పే విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ.. రష్మిక ఇద్దరూ డ్యాన్సులతో దుమ్ములేపారట. విజయ్ దేవరకొండ మొదటి నుంచి స్పెషలిస్ట్ డ్యాన్సర్ ఏమీ కాదు.. మరి సడెన్ గా ఈ డ్యాన్స్ లో ఇంత వేగం.. మెరుపు ఎలా వచ్చాయని కొందరికి అనుమానం వచ్చింది. విజయ్ ఒక నెల రోజుల పాటు ఈ పాటలకు కష్టపడి డ్యాన్స్ ప్రాక్టిస్ చేశాడని టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్ కోసం మ్యూజిక్ ఫెస్టివల్స్ ప్లాన్ ఫైనలైజ్ చేసుకున్న వెంటనే ఒక నెల రోజుల పాటు క్రాంతి మాధవ్.. అనంద్ అన్నామలై సినిమాల షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి మరీ ప్రాక్టీస్ చేశాడట. అందుకే విజయ్ దేవరకొండ డ్యాన్సుల్లో సూపర్ జోష్ కనిపిస్తోందట.
'డియర్ కామ్రేడ్' చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత స్టూడెంట్ యూనియన్ రాజకీయాల నేపథ్యంలో ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్. దర్శకుడు భరత్ కమ్మ. మైత్రీ మూవీ మేకర్స్.. బిగ్ బెన్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.