విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా నుండి కూడా యూత్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను కలిగి ఉన్నాడు. ఇలాంటి దేవరకొండ ఒక విమర్శను ఎదుర్కొంటున్నాడు. ఈయన సినిమాలో ఎక్కువగా స్మోకింగ్ చేసే సీన్స్ మందు తాగే సీన్స్ ఉంటున్నాయి. వాటి వల్ల ఆయన్ను అభిమానించే ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు వాటిని అలవాటు చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఇండైరెక్ట్ గా ఎంతో మంది యూత్ జీవితాలను స్మోకింగ్ మరియు మందుతో నాశనం చేస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి.
తాజాగా విజయ్ దేవరకొండ ఈ విషయమై తనదైన శైలిలో స్పందించాడు. సినిమాల వల్ల ఇలాంటి చెడు అలవాట్లు వస్తాయంటే నేను నమ్మను అంటూ ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. నేను నా స్నేహితుడు ఇద్దరం సినిమాలు చూస్తాం. నా స్నేహితుడు ఆయన అభిమాన హీరో స్మోకింగ్ చేస్తున్నాడని వీడు చేస్తాడు. కాని నేను నా అభిమాన హీరో స్మోక్ చేసినా కూడా నేను చేయను. నాకు అది ఇష్టం ఉండదు కనుక నేను దాని నుండి ప్రభావితం అవ్వలేదు. సినిమాలు చూసి ప్రభావం అవ్వడం అనేది వ్యక్తిగతం. అది సినిమా తప్పు కాదు. కొందరు మాత్రమే ప్రభావితం అవుతున్నారు అంటే అది వారి తప్పే అన్నట్లుగా రౌడీ చెప్పుకొచ్చాడు.
అలాంటి వారు సినిమాలు చూడటం ద్వారానే కాకుండా పక్కింటి అన్ననో లేదంటే కాలేజ్ లో ఉండే ఇతర స్టూడెంట్స్ ను చూసో కూడా ఆ అలవాట్లను చేసుకునే అవకాశం ఉంది. ప్రభావితం అయ్యే వారు ఎవరిని చూసైనా ప్రభావితం అవుతారు. అందుకే ఇక్కడ సినిమాలో అటువంటి సీన్స్ ఉండటం వల్ల యూత్ చెడు అలవాట్లు చేసుకుంటున్నారు అనడంలో ఎలాంటి అర్థం లేదు అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. సినిమాలో హీరో పాత్రను లేదంటే మరేదైనా పాత్రను డెప్త్ గా చూపించాలి అంటే ఖచ్చితంగా అలాంటివి ఉండాలని రౌడీ అభిప్రాయ పడ్డాడు. తనకు మందు అలవాటు ఉంది కాని అది ఎప్పుడు ఎక్కడ తాగాలి.. ఎప్పుడు తాగవద్దనే విషయాలు నాకు తెలుసు. ఇక స్మోకింగ్ నా వ్యక్తిగత కారణాల వల్ల నాకు ఇష్టం ఉండదని విజయ్ చెప్పుకొచ్చాడు.