పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎలా ఉంటాడో ప్రత్యేకంగా విడమరిచి చెప్పనక్కర్లేదు. ఆయన హీరోలను తెరపై చూపించే విధానం.. చెప్పించే డైలాగులు మరే దర్శకుడికి రైటర్ కి సాధ్యపడని రీతిలో ఉంటాయని చెప్పవచ్చు. సినిమాలో హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసి చూపించే డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ముందు వరుసలో ఉంటాడు. హీరోలకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి దానికి స్పెషల్ ఇమేజ్ ని తీసుకొస్తాడు. ఆయనకంటూ ఓ ఇగో.. ఆయనకంటూ ఓ వ్యక్తిత్వం.. ప్రత్యేకత ఉంటాయి. అవే సిల్వర్ స్క్రీన్ పై హీరోలలో కనిపిస్తూ ఉంటాయి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనిపించుకున్న పూరి.. మనసులో ఒకటి బయటకు ఇంకోటి మాట్లాడలేడు. పూరీ సినిమాల్లో హీరో కూడా అంతే. హీరో కారక్టరైజేషన్ లో కొంచెం నెగిటివిటీ ఉంటుంది. ఈ సమాజం యాక్సెప్ట్ చేయలేని విధంగా హీరో మాట్లాడుతూ ఉంటాడు. బూతులు మాట్లాడుతుంటాడు.. జనాలు హేట్ చేసేలా బిహేవ్ చేస్తుంటాడు. అదే పూరి నుండి ప్రేక్షకులు కోరుకుంటుంటారు. ఆయన ఫస్ట్ సినిమా నుండి ఈ మధ్య వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా వరకూ ఇదే పద్ధతి ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే పూరీతో యాక్ట్ చేసిన హీరోలకు ఆ సినిమాలు ప్లాప్ అయినా ప్రత్యేకంగా మిగిలిపోతాయి. ఇప్పటి యూత్ కి బూతులు మాట్లాడే బ్యాడ్ బాయ్స్ నచ్చుతున్నారని పసిగట్టి పూరి రెగ్యులర్ హీరోనే ఇంకాస్త పచ్చిగా మాట్లాడిస్తాడు. ఆయన గత చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' అందుకే పెద్ద హిట్టయి కూర్చుంది. అంతవరకు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ సినిమాలో కంప్లీట్ మేక్ ఓవర్ తో మాస్ పాత్రలో అదరగొట్టాడు. అయితే ఇప్పుడు పూరి అదే స్కూల్ లో విజయ్ దేవరకొండ జాయిన్ అవబోతున్నాడట.
పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ దేవరకొండ - అనన్య పాండే హీరో హీరోయిన్లుగా 'ఫైటర్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర కూడా ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే బూతులు మాట్లాడ్డం.. హేట్ చేసేలా ప్రవర్తించడం చేస్తుందట. పూరి సినిమాల్లో ఇది రొటీన్ అయినా విజయ్ దేవరకొండ ఇలా ప్రవర్తిస్తే కిక్ ఇస్తుందనే మాట వాస్తవం. 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ పాత్ర బిహేవ్ చేసిన విధానం చూస్తే 'ఫైటర్'లో ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పూరి జగన్నాధ్ తో సినిమా అంటే మొదట్లో అటు ఇటు అయిన విజయ్ వరుస పరాజయాలతో తనకి కూడా ఇమేజ్ మేకోవర్ అవసరమని ఈ చిత్రాన్ని అంగీకరించాడు. ఈ చిత్రం అమ్మ సెంటిమెంట్ తో పాటు కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. వినడానికి 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలా' అనిపిస్తున్నా ఇస్మార్ట్ ఫార్ములా దీన్ని కొత్తగా చూపిస్తుందని పూరి నమ్మకంగా ఉన్నాడట. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా పూరి - ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఫైటర్' ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు.