తమిళ సూపర్ స్టార్ విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ ని ప్రారంభించడంతో వివాదం మొదలు అయ్యింది. చంద్రశేఖర్ పార్టీని ప్రకటంచిన వెంటనే విజయ్ స్పందిస్తూ తనకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ పార్టీలో తన అభిమానులు ఎవరు చేరవద్దంటూ సూచించాడు. ఆ పార్టీ కోసం తన అభిమాన సంఘం పేరును కాని, తన ఫొటోను కాని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ హెచ్చరించాడు. ఆ తర్వాత అభిమానులతో భేటీ అయిన విజయ్ మరోసారి ఖరాకండిగా తన తండ్రి పార్టీకి ఎవరు మద్దతు తెలపవద్దంటూ సూచించాడు. అభిమాన సంఘంలో ఉండి రాజకీయ పార్టీతో సంబంధం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దంటూ హెచ్చరించిన విజయ్ తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు.
తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నుండి కొందరు చంద్ర శేఖర్ కు మద్దతు దారులు సానుభూతి పరులు ఉండటంతో వారిని అభిమాన సంఘం నుండి తొలగిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. వారికి అభిమాన సంఘంకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పిన విజయ్ తన తండ్రి చంద్రశేఖర్ విషయంలో మరింత మొండిగా వ్యవహరిస్తున్నాడు. చాలా కాలంగా వీరిద్దరి మద్య విభేదాలు ఉన్నాయి. విజయ్ రాజకీయాల్లోకి రావాలనేది చంద్రశేఖర్ కోరిక. కాని విజయ్ మాత్రం ఇది సరైన సమయం కాదంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను విజయ్ తండ్రి చంద్రశేఖర్ పార్టీని ప్రకటించాడు. మరి వచ్చే ఎన్నికల్లో ఏమైనా సత్తా చాటేనా అనేది చూడాలి.