వరుసగా తమిళ స్టార్ హీరోల్ని బుట్టలో వేస్తోంది ఈ అమ్మడు. ఇలయదళపతి విజయ్ సరసన మాస్టార్ చిత్రంలో నటిస్తూనే.. ఎనర్జిటిక్ ధనుష్ సరసన నెక్ట్స్ సినిమాకి లైనేస్తోంది. మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమపైనా కన్నేసింది. ఈలోగానే హిందీలో మరో క్రేజీ ఆఫర్ ని అందుకుంది. చూస్తుండగానే వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుంటోంది. ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ అంటే మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `పేటా` చిత్రంతో మాళవిక తమిళ పరిశ్రమకు పరిచయమైంది. ఈ అమ్మడు పక్కా సినీనేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీ వర్గాలకు సుపరిచితమైన నటి మాలవికా మోహనన్. రజనీ తరువాత విజయ్ సరసన ఆఫర్ దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా రజనీ అల్లుడు ధనుష్ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.
దీనికి ముందే సిద్ధాంత్ చతుర్వేది సరసన హిందీ చిత్రానికి సంతకం చేసింది. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు పుట్టినరోజున ధనుష్ శుభాకాంక్షలు తెలుపుతూ.. మాలవికా అతనితో కలిసి నటించాలనే కోరికను బహిరంగంగా ప్రకటించింది. ``మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అద్భుతమైన సంవత్సరం ముందుంది. ధనుష్ సార్! మీతో పనిచేసే అవకాశం వస్తే సూపర్ సంతోషిస్తాను. త్వరలో మీతో కలిసి ఒక చిత్రంలో నటించే అవకాశం ఇస్తారా ??`` అంటూ సూటిగా మ్యాటర్ కి వచ్చేసింది. మొత్తానికి తెలివైన అమ్మాయే. ఎలాంటి దాపరికం లేకుండా ఆసక్తిని వ్యక్తపరిచి ధనుష్ మనసు దోచేసిందిగా. ఇంతటి చొరవ చూపిస్తుంది కాబట్టే వెంట వెంటనే ఆఫర్లు దక్కించుకుంటోందన్నమాట.