`లైగ‌ర్`ని ఎక్క‌డికో లేపుతున్నారు.. ఏంటి సంగ‌తి!

Update: 2021-07-29 00:30 GMT
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడి డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `లైగ‌ర్` చిత్రాన్ని స్వీయ‌ నిర్మాణంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు- హిందీ-తమిళ‌ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత  క‌ర‌ణ్ జోహార్ కూడా భాగ‌మ‌వ్వ‌డంతో పాన్ ఇండియా సినిమా అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. అర్జున్ రెడ్డి త‌ర్వాత రౌడీస్టార్ కి  బాలీవుడ్ లో మంచి పేరొచ్చింది. దీంతో రెండు  భాష‌ల్లోనూ బిగ్ స్కేల్ లో రిలీజ్ అవుతుంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంచ‌నాల్ని పెంచేసాయి. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ న‌టుడు చుంకీ పాండే కుమార్తె అన‌న్యా పాండే తెలుగులో హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. ఆయ‌న కూడా ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతో తండ్రి ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఒకే ప్రేమ్ లో తండ్రీకూతుళ్లు క‌నిపించ‌డంతో చుంకీ ఉబ్బిత‌బ్బితున్నారు.  సినిమాపై..కుమార్తె స‌హా న‌టీన‌టుల అంద‌రి పుర్పామెన్స్ పై  ఓ రేంజ్ లో న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  

`లైగ‌ర్` అనన్య  తొలిదక్షిణాది సినిమా. ఇది ఆమెకు ఎంతో పెద్ద ప్రాజెక్ట్. సినిమా ర‌షెస్ చూసాను. క‌మ‌ర్శియల్ గా పెద్ద స‌క్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.  విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి న‌టుడు. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అత‌ని క‌ష్టం వృథా కాద‌ని చుంకీ పాండే అభిప్రాయ‌ప‌డ్డారు.

``నేను లైగర్ విష‌యంలో చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఎప్పుడూ అనన్యకు చెప్తాను.. బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యే క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మిది`` అంటూ ఎమోష‌న్ అయిన చుంకీ పాండే.. ఆ వ్యక్తి విజయ్ దేవరకొండ.. అద్భుతమైనవాడు. ఓ గాడ్… ఓహ్… ఓహ్… ఓహ్… చాలా బాగా న‌టించాడు. అతను అద్భుతమైన పనిమంతుడు`` అంటూ త‌న ఎగ్జ‌యిట్ మెంట్ ని ఏమాత్రం దాచుకోలేదు. రౌడీని ఒక పెద్ద న‌టుడు అంత‌గా పొగిడేయ‌డం నిజంగా ఆస‌క్తిని రేకెత్తించేదే.

తాను సినిమాలో నటిస్తాన‌ని చుంకీ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇంత‌కుముందే రామ్ గోపాల్ వర్మ కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌పై ప్రశంసలు కురిపించారు. లైగ‌ర్ మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ అవుతుంద‌ని అన్నారు. దేవ‌ర‌కొండ ఏ ఇత‌ర స్టార్ హీరోకి తీసిపోని న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేస్తాడ‌ని పొగిడేశారు. మొత్తానికి ప్ర‌ముఖుల‌ ప్రకటనలన్నీ `లైగర్`పై అంచనాలను పెంచేస్తున్నాయి.

విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. ఈ సినిమా ప్రారంభం నుంచి క‌రోనా మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు వెంట‌ప‌డి త‌రుముతోంది. దీనివ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మ‌వుతోంది. అయినా పూరి అండ్ టీమ్ ఎంతో క‌సిగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అండ‌దండ‌ల‌తో పూరి ఎట్టి ప‌రిస్థితిలో పాన్ ఇండియా హిట్ కొట్టాల‌న్న పంతంతో ఉన్నారు.

మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఇందులో అన‌న్య పాండేతో ల‌వ్ ట్రాక్ యూత్ ని ఓ రేంజులో ఊపేస్తుంద‌ని పూరి టీమ్ వెల్ల‌డిస్తోంది. ఇంత‌కుముందు విజ‌య్ - అన‌న్య జంట ఘాటైన రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయిన‌ సంగ‌తి తెలిసిన‌దే. విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై పూరి జగన్నాథ్‌- చార్మి కౌర్- కరణ్ జోహార్ - అపుర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.
Tags:    

Similar News