ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా బాక్స్ ఆఫీస్ వద్ద హీరోలకు గట్టి పోటీ ఉంటుందనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలకు అయితే ఈ పోటీ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అయితే అదే తరహాలో ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో కూడా పోటీ పెరుగుతోంది. ఏ హీరో ఎన్ని లైకులు అందుకున్నాడు అలాగే ఎన్ని వ్యూవ్స్ వచ్చాయనేది ప్రధానాంశంగా మారింది.
అయితే రీసెంట్ కోలీవుడ్ హీరో ఇళయదళపతి విజయ్ సినిమా టీజర్ రికార్డు సృష్టించింది. యూట్యూబ్ లో "మెర్సల్" విడుదలైన నాలుగు గంటలకే 699k లైక్స్ ను అందుకుంది. అయితే అతనికి కోలీవుడ్ లో పోటీగా ఉన్న అజిత్ "వివేగం" రికార్డును విజయ్ చెరిపేశాడు. అజిత్ 553k లైక్స్ ని మాత్రమే అందుకున్నాడు. దీంతో విజయ్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు అజిత్ తన సినిమాలతో విజయ్ కి గట్టి పోటీని ఇచ్చేవాడు. కానీ ఈ సారి అంతకు మించిన స్థాయిలో విజయ్ రికార్డు సాధించి పోటీని ఇచ్చాడు.
విజయ్ 'మెర్సల్' లో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. అతనికి జోడిగా కాజల్ - సమంత నటిస్తుండగా మరొక ముఖ్య పాత్రలో నిత్యా మీనన్ కనిపించనుంది. అట్లీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక స్క్రీన్ ప్లే విబాగంలో లో కె.విజయేంద్ర ప్రసాద్ ఉండగా ఏర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళికి ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇక తెలుగులో కూడా అదే రోజు 'అదిరింది' అనే పేరుతో రాబోతోంది.