'ఉప్పెన'లో కూతురులా భావించా.. రొమాన్స్‌ ఎలా చేస్తాను?

Update: 2021-09-06 04:55 GMT
ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి చిన్న వయసులోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 17 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టికి విజయ్ సేతుపతికి జోడీగా నటించే అవకాశం వచ్చిందట. తమిళంలో విజయ్‌ సేతుపతి హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా కృతిని ఎంపిక చేసేందుకు గాను మేకర్స్ ప్రయత్నించారట. అయితే ఆ నిర్ణయాన్ని విజయ్‌ సేతుపతి కొట్టిపాడేశాడు. కృతి శెట్టికి ఉప్పెన సినిమాలో విజయ్‌ సేతుపతి తండ్రి పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. అందుకే ఆమెను దర్శక నిర్మాతలు ఎంపిక చేసిన తర్వాత విజయ్‌ సేతుపతి కాదన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్‌ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. సినిమా యూనిట్‌ సభ్యులకు నేను ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించిన విషయం తెలియదు. అందుకే ఆమెను నా సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. కాని నేను చేయను అని చెప్పేశా. ఉప్పెన సినిమా క్లైమాక్స్‌ షూటింగ్ సమయంలో ఆమెతో నన్ను ఒక తండ్రిగా భావించి నటించమని చెప్పాను. నేను కూడా నా కూతురుగా భావించే ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రియలిస్ట్ గా నటించాను. నా 15 ఏళ్ల కొడుకు కృతి కంటే కాస్త చిన్నవాడు. అందుకే తనను నేను కూతురుగానే భావిస్తాను. అందుకే ఆమెతో కలిసి నటించలేను అని టీమ్ కు చెప్పాను అన్నాడు. కూతులా భావించిన అమ్మాయితో ఎలా రొమాన్స్‌ చేస్తాను చెప్పండి  అంటూ యూనిట్ సభ్యులను ఒప్పించి మరో హీరోయిన్ ను ఎంపిక చేయించినట్లుగా తెలుస్తోంది.

కోలీవుడ్‌ తో పాటు అన్ని వుడ్స్ లో కూడా ప్రస్తుతం విజయ్ సేతుపతి మోస్ట్‌ బిజీ హీరో కమ్‌ నటుడు. ఆయన వరుసగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకుంటున్న కారణంగా ఆఫర్లు బ్యాక్ టు బ్యాక్‌ వస్తూనే ఉన్నాయి. తెలుగు లో ఆయన ఉప్పెన సినిమాతో బిగ్‌ సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో మరిన్ని సినిమా ఛాన్స్ లు ఆయన తలుపు తడుతూనే ఉన్నాయి. ఇంత బిజీ నటుడు ఒక హీరోయిన్‌ విషయంలో అంతగా ఆలోచించడం అంటే నిజంగా అభినందించాల్సిన విషయం. దంగల్ లో కూతురుగా నటించిన హీరోయిన్ తో ఆ వెంటనే అమీర్ ఖాన్ రొమాన్స్ చేసిన విషయం తెల్సిందే. కాని విజయ్ సేతుపతి మాత్రం హుందాగా వ్యవహరించారు అంటూ ఆయన అభిమానులు అభినందిస్తున్నారు.
Tags:    

Similar News