తమిళనాట విజయ్ సేతుపతికి విపరీతమైన క్రేజ్ ఉంది. మాస్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ .. అజిత్ ల లెక్క వేరు .. విజయ్ సేతుపతి క్రేజ్ వేరు. అయినా ఆ ఇద్దరు హీరోలతో నటించడానికి హీరోయిన్లు ఎంత ఉత్సాహాన్ని చూపుతారో, విజయ్ సేతుపతి జోడీగా కనిపించడానికి కూడా అంతే ఆత్రుతను కనబరుస్తూ ఉంటారు. సాధారణంగా ఒక భాషలో హీరోగా చేస్తున్నవారు, ఇతర భాషల్లో విలన్ గా చేయడానికి పెద్దగా అభ్యంతరం చెప్పరు. కానీ ఒకే భాషల్లో ఒక వైపున స్టార్ హీరోగా కొనసాగుతూ .. మరో వైపున స్టార్ విలన్ అనిపించుకోవడం కూడా విజయ్ సేతుపతి వల్ల మాత్రమే అయిందని చెప్పుకోవాలి.
ఇక మధ్య కాలంలో తెలుగులో కూడా విజయ్ సేతుపతి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. 'ఉప్పెన' సినిమా తెలుగు ప్రేక్షకులకు ఆయనను మరింత చేరువ చేసింది. ఈ సినిమాలో ఆయన నటన పట్ల ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమాకి సంబంధించి ఏ మాత్రం అవకాశం ఉన్నా విజయ్ సేతుపతిని రంగంలోకి దింపడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. కానీ ఆయన డేట్లు దొరకడమే కష్టం. తెలుగులో 'పుష్ప' .. హిందీలో 'లాల్ సింగ్ చద్దా' సినిమాలను డేట్లు సర్దుబాటు చేయలేక వదులుకున్నాడు.
ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసిన అంశం విజయ్ సేతుపతి ఆ సినిమాలను ఎందుకు వదులుకున్నాడు అనేది కాదు. 'అనబెల్ సేతుపతి' సినిమాను ఎలా ఒప్పుకున్నాడు అనేదే. ప్రేక్షకులకు విజయ్ సేతుపతి నటనపై ఎంతటి నమ్మం ఉంటుందో .. ఆయన ఒప్పుకునే కథలపై .. పాత్రలపై ఆంతటి నమ్మకం ఉంటుంది. అలాంటి వారందరికి షాక్ ఇచ్చిన సినిమా 'అనబెల్ సేతుపతి'. ఇది హారర్ కామెడీ నేపథ్యంలో సాగే కథ. కానీ ప్రేక్షకులకు నవ్వురాదు .. భయం వేయదు.
ఖరీదైన బంగ్లాలో దెయ్యాలు చేసే గోలతోనే సినిమా నడుస్తుంది.
ఖరీదైన బంగ్లా ఉంది .. కానీ అందులో కథే లేదు. ఒకవేళ ఆ బంగ్లాలో ఏ మూలైనా కనిపించకుండా కథ నక్కినప్పటికీ, అది విజయ్ సేతుపతి స్థాయికి తగిన కథ మాత్రం కాదు. మొహమాటం కొద్దీ ఆయన ఇలాంటి సినిమాలు చేసినా, ప్రేక్షకులు మొహమాటానికి చూడరనే విషయం కూడా ఆయన గ్రహించాలి. యుద్ధం కూడా స్థాయికి తగినవారితోనే చేస్తారు .. అలాగే సినిమాలు కూడా తమ క్రేజ్ కి తగినవే చేయాలి. లేదంటే ఇలాంటి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఇక విజయ్ సేతుపతి సంగతి అటుంచితే, తాప్సీ కూడా అలాగే వ్యవహరించింది. బాలీవుడ్ ను చుట్టబెట్టి భారీ విజయాలను అందుకున్న ఆమెకి, ఎలాంటి కథలను ఎంచుకోవాలో ఒకరు చెప్పవలసిన పనిలేదు. ఆల్రెడీ 'గంగ' వంటి సినిమా చేసిన ఆమెకి హారర్ కామెడీ ఎలా ఉండాలో తెలుసు. కానీ ఆమె కూడా ఈ కథకి తలాడించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక జగపతిబాబు .. రాజేంద్రప్రసాద్ .. రాధిక కూడా విషయం లేని పాత్రల్లో ఇమిడిపోవడానికి నానాపాట్లు పడ్డారు పాపం.