కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఇటీవల బెంగుళూరు ఎయిర్ పోర్టులో ఓ ఆగంతకుడు దాడి చేసినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విజయ్ సేతుపతి వివరణ కూడా ఇచ్చాడు. అతను మద్యం మత్తులోనే దాడి చేసాడని...ఇదేమీ పెద్ద విషయం కాదని...ప్రజలే బూతద్దంలో పెట్టి చూస్తున్నారని సేతుపతి వ్యాఖ్యానించారు. తాజాగా ఆ దాడి వెనుక చాలా మిస్టీరియస్ విషయాలే ఉన్నాయన్నది బయటకు వస్తోంది. ఆ దాడికి పాల్పండింది కూడా తమిళ నటుడేనట. అతని పేరు మహా గాంధీ. కోలీవుడ్ లో 10-15 సినిమాలు చేసాడుట. తాజాగా మహా గాంధీ ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాడి వెనుక అసలు కారణాలు ఇవీ! అంటూ పెద్ద షాక్ ఇచ్చారు.
``విజయ్ సేతుపతి-నేను ఒకే విమానంలో ప్రయాణించాం. జాతీయ అవార్డు అందుకున్నందకు అభినందించి కృతజ్ఞతలు చెప్పాను. ఆయన చాలా పొగరుగా ఇదొక దేశమా? అని కించపరిచినట్లు పొగరుగా మాట్లాడారు. నేను ముత్తరామలింగ దేవర్ భక్తుడిని. ఆయన గురించి అడిగితే ఎవరు? అంటూ అవమానించారు. నటుడిగా విజయ్ కి పెద్ద అభిమానినే. కానీ నాతో మాట్లాడిన విధానం..పద్ధతి ఎంత మాత్రం బాగోలేదు. ఆ కోపంతోనే దాడి చేసా. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్తే మాట్లాడి పంపించేసారు`` అని మహాగాంధీ తెలిపారు. ఈ వివాదంపై `హిందుమక్కల్ కట్చి` అధినేత అర్జున్ సంపత్ కూడా స్పందించారు. విజయ్ సేతుపతి నిజంగానే అలా మాట్లాడి ఉంటే దాడిని సమర్ధిస్తాం... అని అన్నారు.
``ఓ జాతీయ అవార్డు అందుకున్న నటుడు దేవర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచింది కాదు. దీనిపై విజయ్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్షమాపణలు చెప్పి..జాతీయ అవార్డుని తిరిగి కేంద్రానికి ఇచ్చేయాలి`` అంటూ అర్జున్ సంపత్ డిమాండ్ చేసారు. అయితే విజయ్ సేతుపతి అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిమాన హీరోకి మద్దుతుగా పోస్టులు పెడుతున్నారు. ఇదంతా కావాలనే చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరి తాజా వ్యాఖ్యలపై విజయ్ సేతుపతి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.