కోలీవుడ్ సంచలనం ఇలయతలపతి విజయ్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండస్ర్టీలో అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోల్లో విజయ్ ఒకరు. తమిళ్ లో ఎంత మంది హీరోలున్నా విజయ్ స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఆయనకు ఆయనే పోటీ. ఆయనకు ఎవరు సాటి అన్న చందంగా విజయ్ కెరీర్ దూసుకుపోతుంది అక్కడ.
విజయ్ జనరేషన్ హీరోల్లో అతనో పవర్ స్టార్. విజయ్ సినిమా అంటే? తమిళ్ లో కోట్ల కనక వర్షం కురవాల్సిందే. మార్కెట్ పరంగా కోలీవుడ్ లో ఇప్పుడాయన కొత్తగా చేయాల్సిందేం లేదు. ఇతర భాషల్లో మార్కెట్ ని బిల్డ్ చేసుకోవడమే మిగిలుంది. అందుకే ముందుగా ఇప్పుడు తెలుగు మార్కెట్ పైనా కన్నేసారు. 'వారసుడు' సినిమాతో తెలుగు మార్కెట్ ని దున్నేసే ప్లాన్ లో ఉన్నారు.
ఈ సినిమాకి సైతం భారీగానే పారితోషికం అందుకున్నారు. తెలుగు..తమిళ్ భాషల్లో రిలీజ్ కానున్న సినిమా కాబట్టి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ చెన్నైలో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నై నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఈ లగ్జరీ అపార్ట్మంట్ను కొనుగోలు చేశాడట.
దీని ధర సుమారు రూ.35కోట్లు అని సమాచారం. సకల సౌకర్యాలు ఈ లగ్జరీయస్ హౌస్ లో ఉన్నాయట. ప్లాట్ కొనుగోలు అనంతరం తన అభిరుచికి తగ్గట్టు కొట్ల రూపాయలు వెచ్చించి మళ్లీ చిన్నపాటి మార్పులు చేయించారుట. మరి విజయ్ ఈ కొత్త ప్లాట్ కొనుగోలు చేయడం వెనుక అసలు కారణం ఏంటి? అంటే ప్రస్తుతం విజయ్ చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ గల సొంత ఇంటిలోనే ఉంటున్నారు.
అయితే అక్కడ కొన్ని నెలలుగా విపరీతమైన ట్రాపిక్ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారుట. దీంతో ఇంట్లో నివసించడం బాగా డిస్టబెన్స్ గా ఉంటుందిట. ఈ క్రమంలోనే తక్షణం ఆ ఇంటిని ఖాళీ చేసి కొంత ఇంటికి వెళ్లిపోవాలన్న ఆలోచనతోనే ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంట్లో ఆఫీస్ సౌకర్యం కూడా ఉందిట. స్టోరీ డిస్కషన్స్ కి సంబంధించి ప్రత్యేకంగా ఓ సపరేట్ రూమ్ సైతం ఉన్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.