స్టార్ హీరోలతో పాట పాడించడం అన్నది రెగ్యులర్ గా చూస్తున్నదే. దేవీశ్రీ ప్రసాద్- ఎస్.ఎస్.థమన్ లాంటి పాపులర్ సంగీత దర్శకులు హీరోలతో పాడించేందుకు ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. ఇప్పుడు థమన్ తన తదుపరి చిత్రం కోసం దళపతి విజయ్ తో ఒక పాట పాడించేశాడు.
విజయ్ నటిస్తున్న వారిసు (వారసుడు-తెలుగు టైటిల్ అని భావిస్తున్నారు) నుండి మొదటి సింగిల్ ఈ దీపావళికి విడుదల కానుందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు.. ``రంజితమే ఏ రంజితమే..`` అని సాగే పాటను విజయ్ స్వయంగా ఆలపిస్తున్నారు. జోనితా గాంధీ ఫీమేల్ వాయిస్ అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ భారీ చిత్రంలో విజయ్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో జయసుధ- ప్రకాష్ రాజ్- ప్రభు- శ్రీకాంత్- యోగి బాబు- శరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ స్వరాల్ని సమకూరుస్తున్నారు.
వారిసు వచ్చే సంక్రాంతి బరిలో విడుదల కానుందని సమాచారం. అయితే అదే సమయంలో టాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. విజయ్ ఠఫ్ కాంపిటీషన్ ని ఎదుర్కోనున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.