బాలయ్య టాప్ 5 ఓపెనింగ్స్.. డాకు బ్రేక్ చేసేనా?
నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి ఈ సంక్రాంతి రేసులో ‘డాకు మహారాజ్’ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి ఈ సంక్రాంతి రేసులో ‘డాకు మహారాజ్’ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ అయితే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెంచింది. వరుస హ్యాట్రిక్స్ తో బాలయ్య జోరు మీద ఉన్నాడు.
ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ పుష్కలంగా ఉండేలా దర్శకులు మూవీస్ చేస్తున్నారు. అందుకే ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘డాకు మహారాజ్’ కూడా వాటికి మించి హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ సినిమాపై 70 కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది.
దీంతో బాలయ్య ఈ చిత్రంతో 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరుతాడని భావిస్తున్నారు. సంక్రాంతి రేసులో గట్టి పోటీ మధ్యలో వస్తోన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలయ్య కెరియర్ లో తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు అత్యధిక షేర్ అందుకున్న చిత్రంగా ‘వీరసింహారెడ్డి’ నిలిచింది. ఈ మూవీ ఏకంగా 25.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీని తర్వాత ‘అఖండ’ మూవీ 15.39 కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉంది.
బోయపాటి కాంబో కావడంతో ‘అఖండ’కి మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత ఏడాది రిలీజ్ అయిన ‘భగవంత్ కేసరి’ మూవీ కూడా 14.36 కోట్ల షేర్ ని మొదటి రోజు కలెక్ట్ చేసింది. వీటి తర్వాత అత్యధిక షేర్ అందుకున్న చిత్రంగా ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ గా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ నిలిచింది. ఈ మూవీ 7.6 కోట్ల షేర్ మొదటి రోజు వసూళ్లు చేసింది. అయితే ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక నెక్స్ట్ లైన్ అప్ లో ‘రూలర్’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలు ఉన్నాయి.
ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ట్రీట్ గా జనవరి 13న ‘డాకు మహారాజ్’ వస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఏ స్థాయిలో షేర్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ వీరసింహారెడ్డి కలెక్షన్స్ షేర్ ని ఈ మూవీ బ్రేక్ చేస్తే మాత్రం కచ్చితంగా రికార్డ్ అవుతుంది.
భగవంత్ కేసరి – 14.36CR
వీరసింహారెడ్డి – 25.35CR
అఖండ – 15.39Cr
రూలర్ – 4.25Cr
ఎన్టీఆర్ మహానాయకుడు– 2.12Cr
ఎన్టీఆర్ కథానాయకుడు – 7.6Cr