విజ‌య్ - వంశీ పైడిప‌ల్లి కాస్టింగ్ లిస్ట్ పెద్ద‌దే

Update: 2022-05-10 13:08 GMT
త‌మిళ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ కొత్త స్కెచ్ వేశాడు. త‌మిళంలో ఎంత స్టార్ డ‌మ్ వున్న తెలుగు హీరోల్లా తన మార్కెట్ స్థాయిని పాన్ ఇండియా వైడ్ గా పెంచుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా తొలిసారి తెలుగు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే విజ‌య్ చిత్రాల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో తెలుగు ద‌ర్శ‌కుడు, తెలుగు నిర్మాత‌తో సినిమా చేయ‌డం క‌రెక్ట్ అని భావించిన విజ‌య్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

ద‌ళ‌ప‌తి 66 వ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, పీవీపీ సినిమా బ్యాన‌ర్ ల‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, శిరీష్ , ప‌ర‌మ్ వి పొట్లూరి, పెర‌ల్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ భామ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాబాద్ లో ప్రారంభమైంది. అయితే కీల‌క న‌టీన‌టులు ఎవ‌రన్న‌ది మాత్రం మేక‌ర్స్ వెల్ల‌డించ‌లేదు. ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో న‌టించే న‌టీన‌టుల వివ‌రాల్ని వ‌న్ బై విడుద‌ల చేస్తున్నారు.

అయితే మొత్తం కీల‌క న‌టీన‌టుల‌ని చూస్తే భారీ లిస్టే వున్న‌ట్టు స్ప‌ష్ణ‌మైంది. ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌కాష్ రాజ్‌, ప్ర‌భు, శ్రీ‌కాంత్‌, జ‌య‌సుధ, `కిక్‌` శ్యామ్‌, సంగీత‌, యోగిబాబు, సంయుక్త‌ క‌నిపించ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ న‌టుల స‌మాహారంగా భారీ తారాగ‌ణంతో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రెండు నిర్మాణ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ లిస్ట్ లో చాలా మంది వ‌ర‌కు తెలుగులో న‌టించిన వాళ్లే కావ‌డం విశేషం. శ‌ర‌త్ కుమార్ త‌మిళ న‌టుడే అయినా `గ్యాంగ్ లీడ‌ర్` నుంచి `భ‌ర‌త్ అనే నేను` వ‌ర‌కు తెలుగు సినిమాల్లో క‌నిపించిన ఆక‌ట్టుకున్నారు.

ఇక ప్ర‌కాష్ రాజ్ అక్క‌డి వాడు ఇక్క‌డి వాడూనూ. ఇరు భాష‌ల‌కు తెలిసిన న‌టుడే. జ‌య‌సుధ త‌మిళంలో ఈ మ‌ధ్య న‌టించ‌లేదు. ఇక హీరో శ్రీ‌కాంత్ కిదే తొలి త‌మిళ చిత్రం. కిక్ శ్యామ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌మిళ న‌టుడే అయినా తెలుగులో `కిక్‌` సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. `రేసు గుర్రం`లోనూ అల్లు అర్జున్ కు సోద‌రుడిగా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఆ త‌రువాత తెలుగులో `ఆక్సిజ‌న్‌` త‌రువాత అయ‌న చేస్తున్న సినిమా ఇదే. సంగీత తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి. ఇక యోగిబాబు కు మాత్రం తెలుగులో ఇదే తొలి సినిమా అని చెప్పొచ్చు.

ఇలా తెలుగు, త‌మిళ న‌టుల‌తో భారీ తారాగ‌ణంతో ఈ సినిమాని అత్యంత భారీగా తెర‌కెక్కిస్తున్నారు వంశీ పైడిప‌ల్లి. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి క‌థ‌, స్క్రీన్ ప్లే వంశీ పైడిప‌ల్లి, హ‌రి, అహిషోర్ సాల్మ‌న్‌, కార్తీక్ ప‌ళ‌ని ఛాయాగ్ర‌హణం, కెఎల్ ప్ర‌వీణ్ ఎడిటింగ్‌, శ్రీ‌హ‌ర్షిత్ రెడ్డి, శ్రీ‌హ‌న్షిత స‌హ నిర్మాత‌లు, సునీల్ బాబు, వైష్ణ‌వీ రెడ్డి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
Tags:    

Similar News