విజయ్ కాంత్.. ఈ తమిళ హీరో ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఆయనను ప్రజలు ఆదరించలేదు. పెద్దగా సీట్లు కూడా రాలేదు. దీంతో రాజకీయంగా ఒడిదిడుకులకు లోనయ్యారు. ఈయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆస్పత్రి పాలయ్యారు.
చాలా రోజుల నుంచి సైలెంట్ గా ఉంటున్న విజయకాంత్ ప్రస్తుతం కరోనా ప్రబలిన వేళ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన శ్రీఅన్సల్ అలహార్ ఇంజినీరింగ్ కాలేజీతోపాటు డీఎండీకే ప్రధాన కార్యాలయ భవనాన్ని కూడా కరోనా బాధిత ప్రజలకు చికిత్స చేయడానికి ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలా చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచారు.
విజయ్ కాంత్ చేసిన ఈ మంచి పనిపై ప్రశంసలు కురిశాయి. తాజాగా మరోసారి తన గొప్ప మనసును విజయకాంత్ చాటుకున్నారు. కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్న వారిని సమాధి చేయడానికి ఉచిత స్థలాన్ని ఇస్తానని ప్రకటించారు. కరోనా వైరస్ బాధితులను ఎక్కడ పడితే అక్కడ సమాధి చేయకుండా వైరస్ వ్యాపించకుండా ప్రత్యేక పద్ధతుల్లోనే ఖననం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన స్థలాన్ని వారి కోసం ఇస్తున్నట్టు విజయకాంత్ ప్రకటించడం విశేషం. ఈ పనితో విజయకాంత్ మరోసారి మంచి మనసున్న నేతగా ప్రజల్లో పేరు సంపాదించారు.
కాగా ఇప్పటికే విజయకాంత్ పార్టీ డీఎండీకే నేతలు - కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.