మహేష్ బాలనటుడిగా ఉన్నప్పుడు తనతో కలిసి నటించారు విజయశాంతి. కృష్ణ సరసన ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించారు. ఆ తర్వాత మహేష్ సూపర్ స్టార్ అయ్యారు. కానీ తనతో నటించే అవకాశం రాలేదు. దాదాపు పాతికేళ్లు పైగా అవుతోంది. అప్పటికి తను అగ్ర కథానాయిక. ఇప్పుడు మహేష్ అగ్ర కథానాయికడు. అయితే నాడు ఆ బాలనటుడు ఇప్పుడిలా సూపర్ స్టార్ అవుతాడని విజయశాంతి భావించారా? ఇంత కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు సెట్స్ లో తనతో పాటు నటిస్తున్నారు కాబట్టి ఆ ఇద్దరి మధ్యా ర్యాపో ఎలా ఉంది? మహేష్‌ని లేడీ సూపర్ స్టార్ ఏమని పిలుస్తారు? లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని మహేష్ ఏమని పిలుస్తారు? కొలీగ్ అయినా సూపర్ స్టార్ ని పేరు పెట్టి పిలవకూడదా? .. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. అది కూడా లేడీ బాస్ విజయశాంతి స్వయంగా వెల్లడించారు.
చిన్న పిల్లాడుగా మీతో నటించిన మహేష్.. ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్ అయ్యారు... అంత పెద్ద స్టార్ అవుతాడని అప్పట్లో అనుకున్నారా? ఈ ఛేంజ్ మీకు ఎలా అనిపించింది? అని ప్రశ్నిస్తే.. ``బాబు హీరోగా వస్తున్నప్పుడు చూసి షాకయ్యాను. చిన్నప్పుడు చబ్బీగా అనిపించాడు. అలాంటిది హీరో అయ్యాడు. మొదటి సినిమా చూడగానే ఈ అబ్బాయి సూపర్ స్టార్ అవుతాడు అనిపించింది. ఇంతకుముందు ఇంటర్వ్యూలోనూ ఇది చెప్పాను. సచిన్ టెండూల్కర్ ఎంత పెద్ద బ్యాట్స్ మన్ నో ఈ అబ్బాయి అలా అవుతాడు! అని అన్నాను. ఎందుకో ఆరోజు అలా అనిపించింది. ఇప్పుడు అనుకున్నట్టే సూపర్ స్టార్ అయ్యారు`` అని తెలిపారు.
మహేష్ సెట్లో మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అని ప్రశ్నిస్తే.. ``అమ్మ అని .. మ్యాడమ్ అని`` పిలుస్తారని తెలిపారు. మీరు మహేష్ ని ఏమని పిలుస్తారు? అని ప్రశ్నిస్తే.. మహేష్ అని పిలవను. బాబు అని పిలుస్తాను. సెట్ లో ఉన్నప్పుడు ఎవరితో అయినా గౌరవంగా ఉండాలి. గౌరవం కాపాడాలి. హీరోల్ని గౌరవించాలి. సెట్ లో ఉన్నా ఇంట్లో ఉన్నా మర్యాద తప్పనిసరి అని అన్నారు.
కృష్ణ గారికి మహేష్ కి తేడా ఏమిటి..? అని ప్రశ్నిస్తే.. కృష్ణ గారు సాఫ్ట్. మహేష్ డౌన్ టు ఎర్త్. సీనియర్లను గౌరవిస్తారు. తండ్రిలానే ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు అని కితాబిచ్చారు. మహేష్ క్వాలిటీస్ గురించి చెబుతూ.. తను చాలా సాఫ్ట్.. హంబుల్ అని అన్నారు. హీరో అనగానే డిఫరెంట్ గా ఉంటారు అని అనుకున్నా. కానీ తను సెట్లో చాలా సరదాగా ఉంటారు. పెద్ద వాళ్లంటే గౌరవంగా ఉంటారు అని వెల్లడించారు.