రాజమౌళి చెప్తే వింటాడు

Update: 2021-08-16 09:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న సినిమా మాత్రమే కాకుండా ఆయన నుండి భవిష్యత్తులో రాబోతున్న సినిమాలపై కూడా దేశ వ్యాప్తంగా జనాల్లో అంచనాలు ఆసక్తి ఉంది అంటే ఏ స్థాయిలో ఆయన సినిమాలు దూసుకు పోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. వచ్చే ఏడాదిలో మహేష్‌ బాబుతో సినిమాను చేయబోతున్నాడు. ఈ అన్ని సినిమాలకు కూడా రాజమౌళి తండ్రి.. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథలు అందిస్తున్నారు. మంచి కథలు ఎంపిక చేసుకునే రాజమౌళి కథలను రాసుకోలేడని ఆ మద్య ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చేందుకు గాను రాజమౌళి చాలా కష్టపడతారు. ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే వారు చాలా తక్కువే అని చెప్పాలి. కాని ఎవరైనా మంచి ఆలోచన చెప్తే తప్పకుండా దాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉంటాడు.

తాజాగా విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. కథ రెడీ అయిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టే ముందు స్క్రిప్ట్‌ విషయంలో పలు సందర్బాల్లో చర్చిస్తాం. కథ గురించి పూర్తిగా చర్చించి స్క్రిప్ట్‌ వర్క్ సమయంలో కూడా రాజమౌళి సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాడు. షూటింగ్‌ సమయంలో నేను చాలా తక్కువగా వెళ్తూ ఉంటాను. ఎప్పుడైన రాజమౌళి పిలిస్తే అప్పుడు షూటింగ్ కు వెళ్తాను అని విజయేంద్ర ప్రసాద్‌ అన్నాడు. మేకింగ్‌ టైమ్‌ లో ఏమైనా మార్పులు చెబితే ఇతర దర్శకులకు కాస్త కోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాని రాజమౌళికి మాత్రం షూటింగ్‌ సమయంలో మార్పులు చెబితే నచ్చితే మార్చేందుకు వెనుకాడడు.

ఎడిటింగ్ రూమ్‌ లో కూడా దర్శకులు ఎక్కువ శాతం తమ నిర్ణయాన్ని ఫైనల్‌ చేయాలనుకుంటారు. కాని రాజమౌళి మాత్రం విజయేంద్ర ప్రసాద్‌ చెప్తే ఆ విషయంలో ఆలోచించి వర్కౌట్‌ అవుతుంది అనుకుంటే మార్చేందుకు ఓకే చెప్తాడట. మొత్తానికి రాజమౌళి తన తండ్రి చెప్పే సలహాలు సూచనలు వినడంతో పాటు వాటిని ఆచరణలో కూడా పెట్టడం చేస్తాడట. సినిమాకు ఉపయోగం అనుకుంటే ఎవరు చెప్పినా.. ఏం చెప్పినా కూడా వినాలి. దర్శకులు ఈగోకు వెళ్తే సినిమాలు బొక్క బోర్ల పడ్డ సందర్బాలు ఉన్నాయి. కనుక రాజమౌళి తీరు అభినందనీయం.
Tags:    

Similar News