సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాల సరళి..శైలి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత గొప్ప సినిమా చేస్తాడో? అంత చెత్త సినిమా కూడా చేయడం ఆయనకే తెలుసు. రొటీన్ గా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. రొటీన్ కి భిన్నంగా ఉండటమే ఆయన ఇష్టం. సినిమా చేసిన తర్వాత చూడమని అభిమానులకు..ప్రేక్షకులకు చెప్పరు. వాళ్లకు వాళ్లుగా వెళ్లి చూస్తేనే తప్ప!
నా సినిమా హిట్ చేయండని కోరిన సందర్భం అంటూ ఆయన జీవితంలో ఇప్పటివరకూ లేదు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన 'లడ్కీ' రిలీజ్ కి రెడీ అవుతోంది. తెలుగులో 'అమ్మాయి ' టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో వర్మని ఓ రేంజ్లో ఆటాడేసుకున్నారు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.
''సుమారు పది నెలల క్రితం 'కనబడుట లేదు' అనే సినిమా ఫంక్షన్ కి వెళ్లాను. అక్కడ రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. పది నుంచి 15 సంవత్సరాలు నాలో వర్మపై కోపం..అసహ్యం.చిరాకు వచ్చి కొన్ని మాటలు వచ్చేసాయి. 'శివ' సినిమా చూసాం. నేను కాదు..నాలాంటి కొన్ని వందల మంది రచయితలు..టెక్నిషియన్లు స్ఫూర్తి పొందాం.
సినిమా ఫీల్డ్ లో నిలబడ్డాం. కానీ ఆ రాంగోపాల్ వర్మ కనిపించడం మానేసారు. మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి? మళ్లీ అలాంటి సినిమాలు చేయండని ఆ సినిమా స్టేజ్ మీద అనేసాను. నాలో ఆవేశం అలా అనిపించేసింది. రాము గారు ఇప్పుడు గర్వంగా చెబుతున్నాను. ఇప్పుడు కనిపించారండి. ఎలా కనిపించారు అంటే? అప్పటి శివ కన్నా ఎక్కువగా కనిపించారు.
'అమ్మాయి' సినిమా 45 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇది నిజంగా ఫెంటాస్టిక్. నిజంగా తెలుగు వాళ్లంతా గర్వపడాల్సిన విషయం. అందరూ ఎంతో సంతోషించాల్సిన రోజు ఇది. ఆ లడ్కీ కి ఈ రోజు ఎప్పటికీ గుర్తిండి పోతుంది అని అన్నారు. ఆ సమయంలో రాంగోల్ వర్మ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. స్టార్ రైటర్ మాటల్ని ఎంతో స్పొర్టివ్ గా తీసుకున్నట్లు కనిపించింది.
వర్మపై ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు విసరడం కొత్తేం కాదు. గతంలోనూ పలుమార్లు ట్విటర్ వేదికగా వర్మపై విజయేంద్రుడు సెటైరికల్ గా స్పందించారు. వాటిని సైతం వర్మ అంతే లైట్ గా తీసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటింది. ఇక విజయేంద్ర ప్రసాద్ గురించి వర్మ మాత్రం ఎప్పుడు గర్వంగానే చెబుతారు.
ఆయన గానీ..రాజమౌళిగా ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదని..బాలీవుడ్..హాలీవుడ్ లో ఉండాల్సిన గొప్ప క్రియేటర్లని చెబుతుంటారు. అయితే వర్మపై సెటైరికల్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రోలర్లకి పనిలేకుండా పోయింది. ఆ పని విజయేంద్రుడే చేసేసారంటూ ట్రోలర్లు కామెంట్లు పెడుతున్నారు.