బన్నీకి రిలీఫ్‌ ఇచ్చిన బాహుబలి రైటర్

Update: 2017-05-03 16:16 GMT
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ పవన్ కళ్యాణ్‌ ను చూసి రాసుకున్నా అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఈయన కూడా కీరవాణి ట్విట్టర్లో నానా రచ్చ చేసినట్లు.. ఆ ఇంటర్వెల్ సీన్ ను పవన్ ఫ్యాన్స్ కు ఆపాదించి.. పెద్ద హడావుడే చేశాడులే. అయితే ఈ సీన్ కారణంగా ఇప్పుడు 'చెప్పను బ్రదర్' ఇష్యూతో పవన్ అభిమానులనకు బీభత్సమైన షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ ఖంగుతిన్నాడు. ఎందుకంటే పవన్ బాహుబలి అయితే.. బన్నీ భల్లాలదేవ అంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్.

ఇదేదో బాహుబలిని మించిన వార్ సీక్వెన్స్ అయిపోయేలా ఉందని గమనించిన విజయేంద్ర ప్రసాద్.. అబ్బే బాహుబలి 1 ఆడియో లాంచ్ లో పవన్ పేరును అడివి శేష్‌ ప్రస్తావించగానే క్రౌడ్ అందరూ అరిచేశారు. అలాంటివి ఇంకా మరికొన్ని చూసి నేను ఆ సీన్ రాసుకున్నాను. ఈయన ఈ విధంగా చెప్పేయడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేయడం కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు రాజుకున్న కొత్త నిప్పు ఏంటంటే.. అసలు బాహుబలి ఆడియో లాంచ్ లో పవన్ పేరు చెబితే అరవడమేంటి? మరి వపన్ బాహుబలి అయితే.. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ ఆయనకే సపోర్టర్లు అయితే.. అక్కడ భల్లాల దేవ ఎవరు?

ఏదేమైనా కూడా ప్రతి చిన్నదానికి ఈకలు పీక్కుంటూ ఇలా గగ్గోలు చేయడం అనేది అభిమానులకే చెల్లింది. బహుశా బాహుబలి ని చూసి మన ఫిలింమేకింగ్ ఎబిలిటీను మెచ్చుకుంటూ ఎంజాయ్ చెయ్యాలే కాని.. ఇలా ఒక హీరో మీద మరో హీరో అభిమానులు దూషణలకు దిగడమేంటో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News