ఆర్ ఎస్ ఎస్.. 180 కోట్లు..విజయేంద్ర ప్రసాద్

Update: 2018-04-29 03:30 GMT
‘బాహుబలి’.. ‘భజరంగి భాయిజాన్’ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా విజయేంద్ర ప్రసాద్ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమాలకు కథకుడిగా రాజమౌళి తండ్రి చాలా మంచి పేరు సంపాదించాడు. అప్పట్నుంచే ఆయనకు వివిధ భాషల నుంచి ఆఫర్లు వచ్చాయి. హిందీలో ప్రస్తుతం భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’కు ఆయనే కథ అందిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు చేయాలంటే రచయితగా విజయేంద్ర ప్రసాద్ తిరుగులేని ఆప్షన్ గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హిందీలో తెరకెక్కబోయే ఓ భారీ ప్రాజెక్టులో పని చేసే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థానమైన రాష్ట్రీయ సేవా సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) ప్రస్థానంపై భారీ బడ్జెట్లో ఒక సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్ ఎస్ ఎస్.. భారతీయ జనతా పార్టీల ఆర్థిక సహకారంతో ఏకంగా రూ.180 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనునారట. దీనికి విజయేంద్ర ప్రసాద్ రచనా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు నడుస్తున్నట్లు సమాచారం.

ఇంకా ఈ చిత్రానికి దర్శకుడెవరు.. నటీనటులెవరన్నది నిర్ణయించలేదు. హీరోగా మాత్రం అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ఆర్ ఎస్ ఎస్ వర్గాలతో మాట్లాడుతూ స్క్రిప్టు తీర్చిదిద్దుతున్నారు. పలువురు  ఆర్ ఎస్ ఎస్ ప్రముఖులతోనూ చర్చలు జరుపుతున్నారట. ఆర్ఎస్‌ఎస్ స్థాపన నుంచి దాని ఎదుగుదల.. ఇప్పటి పరిస్థితుల వరకు అన్నీ ఇందులో చూపిస్తారని సమాచారం. ఏదో డాక్యుమెంటరీ లాగా కాకుండా పూర్తి స్థాయి సినిమాలాగానే దీన్ని తీర్చిదిద్దుతారట. అందుకే విజయేంద్రను రచయితగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 
Tags:    

Similar News