విజయేంద్ర ప్రసాద్‌ డైరెక్షన్‌ లేనట్టే

Update: 2015-08-05 18:05 GMT
బాహుబలి రిలీజ్‌ కి ముందు, రిలీజ్‌ తర్వాత అని విజయేంద్ర ప్రసాద్‌ జీవితాన్ని విశ్లేషించవచ్చు. బాహుబలి సక్సెస్‌ అతడి ఫేట్‌ ని మార్చేసింది. ఇప్పుడు అతడు వరల్డ్‌ ఫేమస్‌. ఈ సక్సెస్‌కి అదనంగా భజరంగి భాయిజాన్‌ సక్సెస్‌ కలిసొచ్చింది. అందుకే ఇప్పుడు అతడు కథారచయితగా మరింత బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే రజనీకాంత్‌, చిరంజీవి వంటి సీనియర్‌ హీరోలు సైతం ఇప్పుడు అతడి వెంట క్యూ కట్టారు.

చిరు 150వ సినిమాకి, రజనీ కొత్త సినిమాకి కథలు రాస్తున్నారు విజయేంద్ర ప్రసాద్‌. అంతేకాదు ఇప్పటికే ఆయన వద్ద ఓ స్క్రిప్టు లైబ్రరీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు అందులోంచి దుమ్ము దులిపి ఒక్కో స్క్రిప్టుని వెలుగులోకి తెచ్చే పనిలో ఉన్నాడట. అంతేకాదండోయ్‌ విజయేంద్ర ప్రసాద్‌ లో దర్శకుడు కూడా దాగి ఉన్నాడు. ఆ దర్శకుడిని సంతృప్తి పరిచేందుకు ఇటీవలి కాలంలో ఓ అసాధారణమైన కథను రాసుకున్న ఆయన త్వరలోనే దర్శకత్వం వహించేందుకు కూడా రెడీ అవుతున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఒక నపుంసకుడు అసాధారణ బిహేవియర్‌ కి సంబంధించిన కథాంశం కాబట్టి దీనికి క్యాస్టింగ్‌ దొరకలేదు. అందువల్ల ఇంతకాలం సెట్స్‌ కెళ్లలేదు.

అయితే ఇప్పుడు దర్శకుడవుదామన్నా అందుకు ఆస్కారమే లేనంత బిజీ అయిపోతున్నాడు. రచయితగా మరో పదేళ్లు ఖాళీ లేనంత అనూహ్యమైన డిమాండ్‌ అతడికి వచ్చేసింది. ఇంతకాలం ఎన్నో హిట్టు ఇచ్చినా రాని గుర్తింపు ఒక్క బాహుబలితో వచ్చేసింది. ఇండియాలోనే గొప్ప రచయిత అన్న పేరు తెచ్చింది ఈ సినిమా. ఇక బాహుబలి పార్ట్‌ 2 రిలీజైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అప్పుడు అస్సలు ఖాళీ ఉండే సీనే లేదు. కాబట్టి ప్రస్తుతానికి విజయేంద్ర ప్రసాద్‌ డైరెక్షన్‌ లేనట్టే.
Tags:    

Similar News