మెగా అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే.. ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమా మగధీర. ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రామ్ చరణ్ కు రెండో సినిమానే అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాము ముందు చరణ్ తో సినిమా తీద్దామని అనుకోనే లేదని ఆ సినిమా రచయిత - రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేసిన శ్రీవల్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా హీరో రామ్ చరణ్ అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా మగధీర సినిమా నాటి విశేషాలను విజయేంద్ర ప్రసాద్ వివరించారు. సింహాద్రి సినిమా తర్వాత చిరంజీవితో సినిమా ఎప్పుడు తీస్తారనే ప్రశ్న రాజమౌళికి వచ్చిందన్నారు. తెలుగులో ప్రతి దర్శకుడి అల్టిమేట్ ఎయిమ్ చిరంజీవితో సినిమా తీయడమే. ఆయన ఆ వరమివ్వాలంటూ రాజమౌళి ఆ టైంలో సమాధానం ఇచ్చాడని చెప్పుకొచ్చారు. తర్వాత కొద్ది రోజుల్లోనే చిరంజీవి నుంచి తమకు పిలుపు వచ్చిందని... తనతో సినిమా తీయాల్సిందిగా కోరారని, అది ఆయన గొప్పతనమేనని అన్నారు. ''వెంటనే మగధీర అనే కథను ఆయన కోసం రాసి.. 100 మంది ఫైటర్ల ఎపిసోడ్ ను డిజైన్ చేసి ఆయనకు వినిపించాం. ఆయనకు వెంట్రుకలు నిక్కపొడుచుకోవడం మేం చూశాం. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆయనతో తీయలేకపోం'' అన్నారు విజయేంద్రప్రసాద్. ఆ సినిమా కథను వేరెవ్వరితో చేయనని రాజమౌళి అనడం.. చివరకు రామ్ చరణ్ తో సినిమా చేసే ఛాన్సు వచ్చినప్పుడు.. ఆ కథనే మగధీర గా తీశామని.. అది మెగా వారసత్వం కారణంగానే చరణ్ అద్భుతంగా చేయగలిగాడని తెలిపారు.
చిరంజీవికి ఎంతో ఖ్యాతి ఉందని... రామ్ చరణ్ నిర్మాతగా ఖైదీ నెంబర్ 150 సినిమా తీసి అంతకు మించిన ఖ్యాతి సంపాదించుకున్నారంటూ విజయేంద్ర ప్రసాద్ ఇదే వేదికపై చరణ్ పై ప్రశంసలు కురిపించేశాడు. సైరా.. నరసింహారెడ్డి సినిమాకు పనిచేసే అద్భుతమైన అవకాశం మీకు వచ్చిందంటూ అక్కడే ఉన్న పరుచూరి గోపాలకృష్ణ ను ఉద్దేశంచి అన్నారు. 10 శాతం రచయిత రాస్తే 100 శాతం నటించగలిగే అద్భుతమైన నటుడు మెగా స్టార్ అంటూ పరుచూరి గోపాలకృష్ణ బదులిచ్చారు.