రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డిప్రెషన్లో ఉన్నాడట. ఆయనకిప్పుడు చాలా బాధగా ఉందట. తన అన్నయ్య కొడుకు ఎస్.ఎస్.కాంచి చేతిలో ప్రతిసారీ ఓడిపోతుండటమే ఆయన డిప్రెషన్ కు కారణమట. ఇంతకీ విజయేంద్ర ప్రసాద్ ఏంటి.. కాంచి చేతిలో ఓడిపోతుండటం ఏంటి..? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘నేనింతకుముందు నవ రసాల గురించి మాట్లాడుతూ ఉండేవాడిని. కాంచి పదో రసాన్ని కనిపిపెట్టాడు. అదే వెటకార రసం. వాడి వెటకారం మామూలుగా ఉండదు. మా ఇంట్లో ఎవరు ఏ సినిమా చేసినా.. ఏం రాసినా.. ఏం తీసినా వాడు తెగ మోసేస్తాడు. వెటకారాలు ఆడేస్తాడు. మా అందరికీ ఒళ్లు మండేలా చేస్తాడు. అందుకే వాడు మాకు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాడు సొంతంగా సినిమా తీశాడు. వాడు మాకు దొరకాలని.. వాడిని వెటకారాలాడే అవకాశం వస్తుందని చూస్తున్నాం. కానీ వాణ్ని మేం మొయ్యాలంటే సినిమాలో తప్పులుండాలి. మావాడి సినిమా కాబట్టి అలా తప్పులుండాలని కోరుకోలేం. అలాగని వాడిని మోసే అవకాశం రాకుంటే ఇబ్బంది. ‘షో టైమ్’ మాకు వెటకారాలాడే అవకాశం రానివ్వలేదని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా మా మీద వాడే గెలిచాడు. వాడి చేతిలో ఇంకోసారి ఓడిపోయినందుకు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను’’ అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. విజయేంద్ర ప్రసాద్ అన్నయ్య శివశక్తి దత్తాకు కీరవాణి.. కాంచి కొడుకులన్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/