ఆడియో వేడుక అనగానే ఒకరినొకరు పొగుడుకోవడానికి వేదిక అయిపోతుంటుంది. ముఖ్యంగా తమ సినిమాల గురించి జనాలు ఏ రేంజిలో డబ్బా కొట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెత్త సినిమాలు తీసి.. వాటి గురించి ఏ రేంజిలో చెప్పుకుంటారో చూస్తుంటాం. ఆడియో వేడుకలో చెప్పే మాటలు విని.. ఏదేదో ఊహించుకుని సినిమాకు వెళ్తే.. అక్కడ బొమ్మ మరోలా కనిపించి జనాలు డిజప్పాయింట్ అవడం కామనే. ‘శ్రీవల్లీ’ ఆడియో వేడుకలో విజయేంద్ర ప్రసాద్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తన సినిమా గురించి తాను మాత్రం అలాంటి మాటలు చెప్పబోనని తేల్చేశారు. తన పిల్లల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానంటూ ఆయన ఎమోషనల్ గా చేసిన ప్రసంగం ఈ వేడుకకు వచ్చిన అందరినీ కదిలించేసింది. ఇంతకీ ఆయనేమన్నారంటే..
‘‘మనందరికీ ఒక చెడ్డ అలవాటుంటుంది. ఒక వ్యక్తి ముందు ఉన్నపుడు ఏమీ మాట్లాడం. పక్కకు వెళ్లాక ఏదేదో వాగుతాం. ఒక వ్యక్తిని తప్పుబట్టాలంటే అతడి ముందే ఆ పని చేయాలి. అతను వెళ్లిపోయాక నోర్మూసుకోవాలి. మనకు ఆ నిజాయితీ ఉండదు. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని. నా పిల్లల్ని చూశాక నాలో మార్పు వచ్చింది. రాజమౌళితో పాటు మిగతా నా పిల్లలందరినీ చూస్తే వాళ్లెందుకు అంత సంతోషంగా ఉన్నారో నాకర్థమైంది. వాళ్ల చుట్టూ ఉన్న వ్యక్తులు అంత మంచి వాళ్లు. అంతటి నిజాయితీ పరులు. వీళ్లకు కూడా అదే అలవాటైంది. అందుకే నేను కూడా వాళ్లలా బతకాలనుకున్నా. ఒక రోజు ఒక నోట్ బుక్ తీసి.. దీన్ని ఎవరైనా చదవొచ్చు అని పైన రాసి దాని లోపల నిజాలే రాయడం మొదలుపెట్టా. మొదటి రోజు ఒక మాట రాస్తున్నపుడు చెయ్యి వణికింది. తర్వాతి రోజు కొంచెం భయం తగ్గింది. తర్వాత తర్వాత అలవాటైపోయింది. నిజాయితీగా ఉండటం అలవాటయ్యాక నాలో గొప్ప మార్పు కనిపించింది. ఈ ఆడియో వేడుకలో కూడా నా సినిమా అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పను. నా కొడుకు ఉన్న స్థాయికి అతడితో నా సినిమా గురించి గొప్పగా చెప్పించి సినిమాను భారీ రేట్లకు అమ్మేయొచ్చు. కానీ అది మోసం. అందుకే అలాంటిదేమీ చేయలేదు. సినిమా గురించి ఎవరూ గొప్పలు చెప్పట్లేదు. ‘శ్రీవల్లీ’లో మంచి కథ ఉంది. ప్రపంచంలో ఇలాంటి కథ ఇప్పటిదాకా రాలేదని ఘంటాపథంగా చెప్పగలను’’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు విజయేంద్ర ప్రసాద్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/