చేసిన తక్కువ సినిమాలతోనే తమిళ.. తెలుగు భాషల్లో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు కార్తి. మధ్యలో అతడి తెలుగు మార్కెట్ కొంచెం దెబ్బ తిన్నప్పటికీ ‘ఊపిరి’ సినిమాతో అతడి రీఎంట్రీ అదిరిపోయింది. తెలుగులో మళ్లీ కార్తి మార్కెట్ రైజింగ్ లోకి వచ్చింది. ఇక అతడి సినిమాలన్నింటినీ తెలుగులో రిలీజ్ చేయడానికి అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలోనే ఆచితూచి సినిమాలు ఎంచుకోవాలని చూస్తున్నాడు కార్తి. త్వరలోనే అతను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేస్తాడని సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం కార్తి.. ‘కాష్మోరా’ అనే హార్రర్ నేపథ్యమున్న సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో నటించాల్సి ఉంది. దీని తర్వాత విజయేంద్ర ప్రసాద్ సినిమా పట్టాలెక్కే అవకాశముంది. మరోవైపు ప్రభుదేవా దర్శకత్వంలోనూ కార్తి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక విజయేంద్ర ప్రసాద్ స్వతహాగా రచయిత అయినప్పటికీ.. ఆయనకు దర్శకత్వం మీద బాగానే మక్కువ ఉంది. ‘శ్రీకృష్ణ 2006’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన ఆయన.. ఆ తర్వాత ‘రాజన్న’ లాంటి క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ చేశాడు. కానీ ఇవి రెండూ కూడా ఆయనకు కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీని తర్వాత ‘వల్లీ’ పేరుతో తెలుగు-కన్నడ-తమిళ భాషలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ రూపొందించాడు. ఇది వచ్చే నెలలోనే విడుదల కాబోతోంది.