అవార్డు విన్నింగ్ డైరెక్టరు అలాంటి పనిచేశాడా..!!

Update: 2017-04-07 11:45 GMT
ఇండియాలో ప్రముఖ డైరెక్టర్లలో ఆయనొకరు. ఆయన టాలెంటుకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు సెక్సువల్ హెరాస్ మెంట్ కేసులో చిక్కుకున్నాడు. తన సంస్థలో పనిచేసిన యువతినే ఆయన లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
    
వికాస్ బెహల్... జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు. క్వీన్ చిత్రంతో ప్రశంసలందుకోవడంతో పాటు స్టార్ డమ్ సొంతం చేసుకున్న దర్శకుడాయన. అయితే... తాజాగా ఆయనకు చెందిన ఫాంటమ్ ఫిల్మ్ సంస్థలో పనిచేసే ఓ యువతి ఆయనపై సంచలన ఆరోపణ చేసింది. వికాస్ తనను లైంగికంగా వేధించాడన్నది ఆమె ఆరోపణ. గోవా టూర్ కు వెళ్లినప్పుడు  వికాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.అంతేకాదు...  అనురాగ్ కశ్యఫ్, విక్రమాదిత్య మోత్వాని, మధు మంథెనా వంటి బాలీవుడ్ ప్రముఖల దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లిందట.
    
కాగా వికాస్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. ఆయన గతంలోనూ  ఫాంటమ్ ఫిల్మ్ సంస్థకు చెందిన మహిళా ఆర్టిస్టులు, ఉద్యోగులతో మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి.  పదిరోజుల కిందట ఈ ఘటన జరగ్గా గత నెల 28నుంచి ఆయన ఆఫీసుకి కూడా రావడం లేదట. కాగా లైంగిక వేధింపుల ఘటనపై దర్శకుడు వికాస్ బెహల్ స్పందించారు. ఆరోపణలు చేస్తున్న యువతి తమ సంస్థల్లో పనిచేయడం లేదని చెప్పిన ఆయన... ఆమెను తన స్నేహితురాలిగా తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలనూ ఆయన ఖండించారు. గోవాలో ఇద్దరం కలిసి పనిచేశామని... అంతేకానీ, ఆమెను ఏమీ చేయలేదని ఆయన చెప్పారు. అయితే.. ఏ విషయంలోనైనా ఆమె బాధపడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. వికాస్ తీరు చూస్తుంటే ఏదో చేసినట్లే కనిపిస్తోందని బాలీవుడ్ లో వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News